ప్రపంచకప్‌లో భాగంగా బర్మింగ్‌హామ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సఫారీలు మరోసారి తడబడ్డారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణేత 49 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 241 పరుగులు మాత్రమే చేసింది. వర్షం వల్ల అంపైర్లు ఇరు వైపులా చెరో ఓవర్ తగ్గించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సఫారీలు 49 ఓవర్లు ఆడారు.
కాగా సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్లలో వాన్‌డర్ డుస్సెన్ (64 బంతుల్లో 67 పరుగులు, 2 ఫోర్లు, 3 సిక్సర్లు), హషీమ్ ఆమ్లా (83 బంతుల్లో 55 పరుగులు, 4 ఫోర్లు)లు మాత్రమే అర్ధ శతకాలు చేయగా… మిగిలిన బ్యాట్స్‌మెన్స్ ఎవరూ కూడా రాణించలేదు. అటు కివీస్ బౌలర్లలో ఫెర్గుసన్ మూడు వికెట్లు తీయగా.. బౌల్ట్, గ్రాండ్‌హోమ్, సాన్టనర్‌లు తలో వికెట్ పడగొట్టారు.