ఉమెన్స్ ఆసియా కప్ 2022లో టీమిండయా అద్భుత ఆటతో ఆకట్టుకుంది. శ్రీలంకతో జరిగిన ఫైనల్లో ఘన విజయంతో 7వ సారి ఆసియా కప్‌ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా అన్ని విభాగాల్లో రాణించి, తొలి మ్యాచ్ నుంచి ఫైనల్ వరకు ఆకట్టుకుంది. ఈ టోర్నీలో 7 మ్యాచ్‌లాడిన టీమిండియా 6 విజయాలు సాధించింది. బంగ్లాదేశ్‌లోని సిల్హెట్ మైదానంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది. భారత జట్టుకు ఇది 7వ ఆసియా టైటిల్. వరుసగా 6 టైటిల్స్ నెగ్గిన సంగతి తెలిసిందే. తొలుత 65 పరుగుల స్వల్ప స్కోరు వద్ద శ్రీలంక బ్యాట్స్‌మెన్‌ను టీమ్ ఇండియా నిలువరించింది. అనంతరం 8.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను చేరింది. భారత్ తరపున రైట్ ఆర్మ్ మీడియం పేసర్ రేణుకా సింగ్ 3 వికెట్లు పడగొట్టింది. కాగా స్మృతి మంధాన 51 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 25 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్సులతో 200కిపైగా స్ట్రైక్‌రేట్‌తో ఆకట్టుకుంది. అదే సమయంలో ఇనోకా రన్వెరా శ్రీలంక తరపున అత్యధికంగా 18 పరుగులు చేసింది. ఒషాది రణసింగ్ 13 పరుగులు జోడించింది. వీరిద్దరూ జట్టు స్కోరును 50కి చేర్చారు.
శ్రీలంకపై 5వ ఫైనల్..
శ్రీలంకతో జరిగిన 5వ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 5 ఫైనల్స్ జరిగాయి. వీటన్నింటిలో టీమిండియా విజయం సాధించింది. భారత జట్టు వరుసగా ఎనిమిదోసారి ఫైనల్ చేరింది.
CHAMPIONS ?
Congratulations to India on their 7th Women’s Asia Cup triumph ?#WomensAsiaCup2022 | Scorecard: https://t.co/KKwY2tz2Pb | ? @ACCMedia1 pic.twitter.com/7U15d7ibT3
— ICC (@ICC) October 15, 2022
ఇరు జట్లు:
భారత మహిళలు (ప్లేయింగ్ XI): షఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, దయాళన్ హేమలత, హర్మన్‌ప్రీత్ కౌర్ (సి), దీప్తి శర్మ, రిచా ఘోష్ (w), పూజా వస్త్రాకర్, స్నేహ రాణా, రేణుకా సింగ్, రాజేశ్వరి గయాక్వాడ్
శ్రీలంక మహిళలు (ప్లేయింగ్ XI): చమరి అతపత్తు(సి), అనుష్క సంజీవని(w), హర్షిత మాదవి, హాసిని పెరీరా, నీలాక్షి డి సిల్వా, కవిషా దిల్హరి, మల్షా షెహాని, ఓషాది రణసింగ్, సుగండిక కుమారి, ఇనోకా రణవీర, అచ్చిని కులసూర్య