Virat Kohli : గౌతమ్ గంభీర్ అవుట్.. కింగ్ కోహ్లీ ఇన్? టెస్ట్ క్రికెట్‌లోకి విరాట్ రీ-ఎంట్రీ!

Virat Kohli : క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు ఒకే ఒక వార్త హాట్ టాపిక్‌గా మారింది. టీమిండియా రన్ మెషీన్, కింగ్ విరాట్ కోహ్లీ మళ్లీ వైట్ జెర్సీ ధరించబోతున్నారా? అవుననే అంటున్నాయి తాజా రిపోర్ట్స్. 2026లో టెస్ట్ క్రికెట్‌లోకి విరాట్ కోహ్లీ గ్రాండ్ రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్త నెట్టింట వైరల్ అవుతోంది.

Virat Kohli : గౌతమ్ గంభీర్ అవుట్.. కింగ్ కోహ్లీ ఇన్? టెస్ట్ క్రికెట్‌లోకి విరాట్  రీ-ఎంట్రీ!
Virat Kohli

Updated on: Jan 03, 2026 | 2:30 PM

Virat Kohli : క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు ఒకే ఒక వార్త హాట్ టాపిక్‌గా మారింది. టీమిండియా రన్ మెషీన్, కింగ్ విరాట్ కోహ్లీ మళ్లీ వైట్ జెర్సీ ధరించబోతున్నారా? అవుననే అంటున్నాయి తాజా రిపోర్ట్స్. 2026లో టెస్ట్ క్రికెట్‌లోకి విరాట్ కోహ్లీ గ్రాండ్ రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్త నెట్టింట వైరల్ అవుతోంది. అయితే, ఈ రీ-ఎంట్రీకి ఒక స్ట్రాంగ్ కండిషన్ ఉందట. అదే టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పదవి నుంచి తప్పుకోవడం. గంభీర్ వెళ్తేనే కోహ్లీ వస్తారనే ప్రచారం ఇప్పుడు క్రీడా వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

కోహ్లీ వర్సెస్ గంభీర్.. ఏమైంది?

గత ఏడాది మే 12న విరాట్ కోహ్లీ అనూహ్యంగా టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ షాక్‌కు గురిచేశారు. టెస్టులంటే ప్రాణం ఇచ్చే విరాట్ ఇంత త్వరగా ఎందుకు తప్పుకున్నారనే దానికి ఇప్పుడు సమాధానం దొరుకుతోంది. ప్రముఖ జర్నలిస్ట్ రోహిత్ జుగ్లాన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో సంచలన విషయాలు బయటపెట్టారు. గంభీర్‌కు, కోహ్లీకి మధ్య అస్సలు పొసగడం లేదని, వారిద్దరి మధ్య మాటలు కూడా లేవని ఆయన పేర్కొన్నారు. ఈ విభేదాల వల్లే కోహ్లీ టెస్టుల నుంచి తప్పుకున్నారని, ఒకవేళ గంభీర్ స్థానంలో కొత్త కోచ్ వస్తే విరాట్ మళ్లీ జట్టులోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.

గంభీర్ పదవికి ముప్పు?

టెస్ట్ క్రికెట్‌లో భారత జట్టు వరుసగా వైఫల్యాలను చవిచూస్తుండటంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గంభీర్ భవిష్యత్తు ఇప్పుడు టి20 వరల్డ్ కప్ 2026 ఫలితంపై ఆధారపడి ఉంది. ఒకవేళ భారత్ వరల్డ్ కప్ గెలవకపోతే గంభీర్‌ను తప్పించి, మరొక దిగ్గజాన్ని కోచ్‌గా నియమించే అవకాశం ఉంది. అదే జరిగితే విరాట్ కోహ్లీ మళ్లీ టెస్టుల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం. కోహ్లీ తన మనసులో ఎక్కడో ఒక చోట రిటైర్మెంట్ తొందరగా తీసుకున్నానా? అనే అసంతృప్తితో ఉన్నారని సన్నిహిత వర్గాల టాక్.

10 వేల పరుగుల మైలురాయి

విరాట్ కోహ్లీ తన 14 ఏళ్ల సుదీర్ఘ టెస్ట్ కెరీర్‌లో 123 మ్యాచ్‌లు ఆడి 9,230 పరుగులు చేశారు. ఇందులో 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. భారత్ సాధించిన ఎన్నో చారిత్రాత్మక విజయాల్లో కోహ్లీ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఆయన మళ్లీ రీ-ఎంట్రీ ఇస్తే, టెస్ట్ క్రికెట్‌లో 10 వేల పరుగుల మైలురాయిని సులభంగా చేరుకోవచ్చు. సచిన్ టెండూల్కర్ తర్వాత ఆ స్థాయిలో టెస్టులను ప్రేమించే కోహ్లీని మళ్లీ వైట్ బాల్‌తో చూడాలని ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

బీసీసీఐలో భారీ మార్పులు

మరోవైపు బీసీసీఐ సెలక్షన్ కమిటీలో కూడా పెను మార్పులు జరగబోతున్నాయి. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ స్థానంలో ప్రజ్ఞాన్ ఓజా వచ్చే ఛాన్స్ ఉంది. ఈ కమిటీలో పార్థివ్ పటేల్ వంటి మాజీలు కూడా చేరబోతున్నారు. ఈ కొత్త కమిటీ విరాట్ కోహ్లీని మళ్లీ టెస్టుల్లోకి తీసుకురావడానికి పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. గంభీర్ పవర్ తగ్గితే కోహ్లీ పవర్ మళ్లీ పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. మరి 2026లో కింగ్ కోహ్లీ బ్యాట్ పట్టుకుని టెస్ట్ గ్రౌండ్‌లోకి దిగుతారో లేదో చూడాలి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి