Mohammed Siraj: అవి బంతులా.. బుల్లెట్లా.. 3 బంతుల్లో 2 వికెట్లు.. వైరలవుతోన్న సిరాజ్‌ సూపర్‌ స్పెల్‌ వీడియో

|

Jul 28, 2022 | 3:51 PM

WI vs IND: విండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్‌ చేసింది. పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో టీమిండియా 119 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా వర్షం కారణంగా ఈ మ్యాచ్‌కు మొదట 36 ఓవర్లకు కుదించారు. యంగ్‌ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (98నాటౌట్‌) ..

Mohammed Siraj: అవి బంతులా.. బుల్లెట్లా.. 3 బంతుల్లో 2 వికెట్లు.. వైరలవుతోన్న సిరాజ్‌ సూపర్‌ స్పెల్‌ వీడియో
Mohammed Siraj
Follow us on

WI vs IND: విండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్‌ చేసింది. పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో టీమిండియా 119 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా వర్షం కారణంగా ఈ మ్యాచ్‌కు మొదట 36 ఓవర్లకు కుదించారు. యంగ్‌ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (98నాటౌట్‌) రెండు పరుగుల తేడాతో సెంచరీ మిస్‌ కాగా, కెప్టెన్‌ ధావన్‌ (58) మరోసారి ఆకట్టుకున్నాడు. వీరిద్దరి చలవతో మొదట బ్యాటింగ్‌ చేసిన భారతజట్టు 36 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం విండీస్‌ లక్ష్యాన్ని 257 పరుగులుగా నిర్దేశించారు. కాటా లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన కరేబియన్‌ జట్టును హైదరాబాదీ బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ (Mohammed Siraj) బెంబేలెత్తించాడు. రెండో ఓవర్‌లో బంతిని అందుకున్న ఈ స్పీడ్‌స్టర్‌ తొలిబంతికే కైల్‌ మైర్స్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. ఇక మూడో బంతికి బ్రూక్స్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో ఒక్క పరుగుకే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆతర్వాత ఏదశలోనూ కోలుకోలేకపోయింది.

కాగా సిరాజ్‌ అందించిన శుభారంభాన్ని సద్వినియోగం చేసుకుంటూ చాహల్‌, శార్దూల్‌, అక్షర్‌ పటేల్‌ మరింత చెలరేగి పోయారు. దీంతో 26 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటైంది ఆతిథ్య జట్టు. ఈ మ్యాచ్‌లో సిరాజ్‌ సంచలన బౌలింగ్‌కు సంబంధించిన వీడియోను విండీస్‌ స్టోర్ట్స్‌ ఓటీటీ ఛానెల్‌ ఫ్యాన్‌ కోడ్‌ అధికారిక ట్విట్టర్‌లో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఐపీఎల్‌లో దారుణంగా విఫలమై సిరాజ్‌ ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో అద్భుతంగా రాణించాడు. పదునైన స్వింగ్, పేస్‌తో బెయిర్‌స్టో, రూట్‌లాంటి టాప్‌క్లాస్‌ ఆటగాళ్లను బుట్టలో పడేశాడు. ఇప్పుడు కరేబియన్‌ జట్టుపైనా తన ప్రతాపం చూపించాడు. తద్వారా ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ అవకాశాలను మరింత మెరుగుపర్చుకున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..