Women’s World Cup : ఐసీసీ మహిళల వరల్డ్ కప్.. ఆస్ట్రేలియా, భారత్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాలలో విన్నర్ ఎవరో చెప్పిన చాట్‌జిపిటి

మహిళల వన్డే ప్రపంచకప్ లీగ్ దశ చివరి అంకానికి చేరుకుంది. ఇప్పటికే మూడు జట్లు సెమీఫైనల్‌కు చేరుకోగా, నాలుగో స్థానం కోసం భారత్, న్యూజిలాండ్, శ్రీలంకలు తీవ్రంగా పోటీపడుతున్నాయి. బంగ్లాదేశ్, పాకిస్తాన్ జట్లు ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించాయి. ఈసారి ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ భారతదేశంలోనే జరగనుంది. నవీ ముంబై ఈ ఫైనల్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది.

Womens World Cup : ఐసీసీ మహిళల వరల్డ్ కప్.. ఆస్ట్రేలియా, భారత్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాలలో విన్నర్ ఎవరో చెప్పిన చాట్‌జిపిటి
Icc Women's World Cup

Updated on: Oct 22, 2025 | 3:02 PM

Women’s World Cup : మహిళల వన్డే ప్రపంచకప్ లీగ్ దశ చివరి అంకానికి చేరుకుంది. ఇప్పటికే మూడు జట్లు సెమీఫైనల్‌కు చేరుకోగా, నాలుగో స్థానం కోసం భారత్, న్యూజిలాండ్, శ్రీలంకలు తీవ్రంగా పోటీపడుతున్నాయి. బంగ్లాదేశ్, పాకిస్తాన్ జట్లు ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించాయి. ఈసారి ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ భారతదేశంలోనే జరగనుంది. నవీ ముంబై ఈ ఫైనల్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించడంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ పాక్ ఫైనల్‌కు చేరుకుంటే, ఆ మ్యాచ్‌ను కొలంబోలో నిర్వహించాల్సి ఉండేది. ఇప్పుడు ఆ సమస్య లేదు. సెమీస్ వేదికలను ఇంకా ఖరారు చేయనప్పటికీ మొదటి సెమీస్ ఇండోర్‌లో, రెండోది ముంబైలోనే జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. నవంబర్ 2న మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ జరగనుంది.

ఈ సందర్భంగా 2025 ఐసీసీ మహిళల క్రికెట్ వరల్డ్ కప్ ఎవరు గెలుస్తారని ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అయిన చాట్‌జిపిటిని సంప్రదించగా.. అది చెప్పిన అంచనాలు ఆసక్తికరంగా మారాయి.

భారత వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టుకు పెద్దగా కలిసి రాలేదు. మొదటి రెండు మ్యాచ్‌లను మాత్రమే గెలిచింది, ఆ తర్వాత మూడింట్లో ఓడిపోయింది. దీంతో సెమీస్‌కు వెళ్లే అవకాశాలను టీమ్ ఇండియా సంక్లిష్టం చేసుకుంది. ఈ క్రమంలో గురువారం భారత మహిళల జట్టు న్యూజిలాండ్‌తో కీలక మ్యాచ్ ఆడనుంది. ఇందులో ఎవరు గెలిస్తే వారు సెమీస్‌కు చేరుకుంటారు. న్యూజిలాండ్ కూడా టాప్ 4 కోసం పోటీ పడే జట్లలో ఒకటి. ఈ మ్యాచ్‌లో కూడా టీమ్ ఇండియా ఓడిపోతే సెమీస్ స్థానం కష్టమవుతుంది. చివరి లీగ్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా అక్టోబర్ 26న బంగ్లాదేశ్‌తో తలపడనుంది.

చాట్‌జిపిటి ఏమని చెప్పిందంటే.. ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు ఎప్పుడూ టోర్నమెంట్‌లో ఫేవరెట్‌గా ఉంటుంది. ఇప్పటివరకు 7 ప్రపంచకప్ టైటిల్స్ గెలుచుకున్న వీరు, 2025లో కూడా స్ట్రాంగ్ టీంగా కనిపిస్తున్నారు. సీనియర్ ఆటగాళ్లు, స్థిరమైన బ్యాటింగ్ లైనప్, వరల్డ్ లెవల్ ఆల్‌రౌండర్లు వీరి బలం. ఒక జట్టుపై నేను పందెం వేయాల్సి వస్తే — అది ఆస్ట్రేలియా. కానీ ఈసారి అంత సులభం కాదని అనిపిస్తోందని చాట్ జీపిటీ తెలిపింది.

2025లో భారత్ సహ-ఆతిథ్యం ఇవ్వడం పెద్ద అదృష్టం. సొంత మైదానంలోని పరిస్థితులు, ప్రేక్షకుల మద్దతు ఇవన్నీ భారత్‌కు బలమైన మద్దతు ఇస్తాయి. స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ వంటి సీనియర్ ఆటగాళ్లు మంచి ఫామ్‌లో ఉన్నారు.. భారత జట్టులో టాలెంట్ ఉంది, పరిస్థితులు వారి వైపే ఉన్నాయి. మంచిగా క్రికెట్ ఆడితే, భారత్ కప్ గెలవడం ఖాయమని చాట్ జీపీటీ చెప్పింది.

దక్షిణాఫ్రికా & ఇంగ్లాండ్ జట్లు గత కొన్నేళ్లుగా మంచిగా డెవలప్ అయ్యాయి. దక్షిణాఫ్రికా పేస్ బౌలింగ్ విభాగం ప్రపంచంలోనే అత్యుత్తమమైనది. ఇంగ్లాండ్ సీనియర్ ఆటగాళ్లతో పాటు కొత్త తరం క్రికెటర్లు కూడా అద్భుతంగా ఆడుతున్నారు.

ఇక ఫైనల్ గా చాట్ జీపీటీ.. ఆస్ట్రేలియా ఇంకా ఫేవరెట్లే, కానీ భారత్ సవాల్‌ను ఎదుర్కోబోతోంది. అది కూడా దాని సొంత గడ్డపై. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ కూడా ఆశ్చర్యం కలిగించవచ్చు. ఈ టోర్నమెంట్ ఇప్పటివరకు చూసిన వాటిలోకెల్లా అత్యంత ఉత్కంఠభరితంగా ఉంటుందని తెలిపింది.

2025 మహిళల వరల్డ్ కప్ కేవలం ఒక క్రికెట్ టోర్నమెంట్ మాత్రమే కాదు. మహిళల క్రికెట్‌లో కొత్త అధ్యాయం రాయబోతోంది. ఆస్ట్రేలియా తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందా? లేక భారత్ సొంత గడ్డపై చరిత్ర సృష్టిస్తుందా? ప్రపంచం మొత్తం ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఎదురు చూస్తోంది.

 

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..