RCB vs MI IPL 2021 Match Prediction: పేపర్‌పై బలమైన జట్లే.. మైదానంలో మాత్రం తేలిపోతున్నారు.. పరాజయాల బాట వీడేదెవరో?

|

Sep 26, 2021 | 7:41 AM

Today Match Prediction of RCB vs MI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 ఎడిషన్‌లో భాగంగా 39 వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ముంబయి ఇండియన్స్ టీం తలపడనున్నాయి.

RCB vs MI IPL 2021 Match Prediction: పేపర్‌పై బలమైన జట్లే.. మైదానంలో మాత్రం తేలిపోతున్నారు.. పరాజయాల బాట వీడేదెవరో?
Ipl 2021, Rcb Vs Mi
Follow us on

IPL 2021, MI vs RCB: కాగితంపై చాలా బలంగా కనిపించే రెండు జట్ల మధ్య కీలకపోరు జరగనుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 ఎడిషన్‌లో భాగంగా 39 వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ముంబయి ఇండియన్స్ టీం తలపడనున్నాయి. ‎ఐపీఎల్ ఫేజ్ 2 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), ముంబై ఇండియన్స్ (MI) జట్లు ఇంకా విజయం సాధించలేదు. మరి ఈ మ్యాచులోనైనా గెలిచి పోటీలోకి రావాలని ఇరు జట్లు ఎదురుచూస్తున్నాయి.

ఎప్పుడు: RCB vs MI, సెప్టెంబర్ 26, 2021, 19:30 IST

ఎక్కడ: దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం

పిచ్: బ్యాట్స్‌మెన్ ఈ పిచ్‌పై నిలదొక్కుకుంటే పరుగులు సాధించడం కష‌్టమేమీ కాదు. సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) మధ్య జరిగిన మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్, శిఖర్ ధావన్ చూపించినట్లుగా సహనం ప్రదర్శిస్తే.. బ్యాట్స్‌మెన్స్‌ ఈ పిచ్‌లో విజయం సాధించేందుకు అవకాశం ఉంటుంది.

ఆర్‌సీబీ వర్సెస్ ఎంఐ హెడ్-టు-హెడ్ (RCB vs MI)
ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 28 మ్యాచులు జరిగాయి. ఇందులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 11, ముంబై ఇండియన్స్ 17 మ్యాచుల్లో విజయం సాధించాయి. రెండో దశలో భాగంగా ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచుల్లో ఇరు జట్లు ఘోరంగా ఓడిపోయాయి. ఇక్కడ గతంలో ఈ రెండు జట్లు తలపడ్డాయి. అయితే ఫలితం సూపర్ ఓవర్‌కు దారితీసింది. ఇందులో ఆర్‌సీబీ విజయం సాధించింది.

లైవ్ స్ట్రీమింగ్
టీవీ – స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్
యాప్ – డిస్నీ+హాట్‌స్టార్

ముంబై ఇండియన్స్ (MI) చరిత్ర ప్రకారం లీగ్‌ను ఓటములతో ప్రారంభించి, లీడ్‌లోకి వస్తారనే అంచనా ఉంది. అయితే ఐపీఎల్ ఫేజ్ 2 లో కేవలం 5 లీగ్ మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ‘మెన్ ఇన్ బ్లూ’ ఇప్పటికే సమయం మించిపోయింది. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టుపై వెంకటేశ్ అయ్యర్ 30 బంతుల్లో 53 పరుగులు చేశాడు. అలాగే మరో కేకేఆర్ బ్యాట్స్‌మెన్ రాహుల్ త్రిపాఠి 42 డెలివరీలలో 74* పరుగులతో నాటౌట్‌గా నిలాచాడు. ఆ మ్యాచులో కోల్‌కతా నైట్ రైడర్స్ 7 వికెట్ల తేడాతో ముంబయిని చిత్తు చేసింది. హార్దిక్ పాండ్యా ఫిట్‌గా ఉంటే మాత్రం ప్లేయింగ్ ఎలెవన్‌లో సౌరభ్ తివారీ స్థానంలో తిరిగి జట్టులో చేరనున్నాడు.

మరోవైపు ఆర్‌సీబీ టీం కూడా చేసిన స్కోర్‌ను కాపాడుకోవడంలో విఫలమవుతోంది. ధోనీ నాయకత్వంలోని చెన్నై జట్టు 6 వికెట్లు మిగిలి ఉండగానే బెంగళూరును ఓడించింది. ఈ మ్యాచులో ఆర్‌సీబీ ఓపెనర్లు బాగానే ఆడారు. కోహ్లీ 41 బంతుల్లో 53 పరుగులు, పడిక్కల్ 70 పరుగులు చేసినా.. బౌలర్లు మాత్రం సరిగ్గా రాణించకపోవడంతో కోహ్లీ టీం ఓడిపోయింది.

ముంబయి టీం కూడా కోల్‌కతాపై జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్లు రోహిత్ శర్మ, క్వింటన్ డి కాక్ 9.2 ఓవర్లలో 78 పరుగుల ప్రారంభ భాగస్వామ్యాన్ని అందిచారు. అయితే ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన ముంబయి టీంకు మిడిల్ ఆర్డర్‌లో తడబాటు గురైంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొరకు కైల్ జమీసన్ జట్టులోకి తిరిగి వచ్చే అవకాశం ఉంది. వనిందు హసరంగ వరుసగా 2 మ్యాచ్‌లలో ఆకట్టుకోలేకపోవడంతో ఆయన స్థానంలో రజత్ పటీదార్‌ని అదనపు బ్యాట్స్‌మన్‌గా చేర్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఆర్‌సీబీ తమ మిడిల్ ఆర్డర్‌ను బలోపేతం చేసుకునే అవకాశం ఉంది.

మీకు తెలుసా?
– 2015 నుంచి డివిలియర్స్ ముంబై ఇండియన్స్‌పై డెత్ ఓవర్లలో 249.40 స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించాడు.

– ఐపీఎల్‌లో కోహ్లీకి ఎంఐ ఓ పీడకలగా మారింది. కోహ్లీ ఎంఐ టీంపై 27.92 సగటుతో పరుగులు చేశాడు. ఇది ఇతర జట్లతో పోల్చితే చాలా తక్కువ ఉంది. గత ఐదు గేమ్‌లలో పేసర్ బుమ్రా మూడుసార్లు ఔట్ చేశాడు.

– యూఏఈలో తమ చివరి ఏడు పరాజయాలలో ఆర్‌సీబీ మొదట బ్యాటింగ్ చేసింది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ XI అంచనా: దేవదత్ పాడిక్కల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), ఏబీ డివిలియర్స్ గ్లెన్ మాక్స్‌వెల్, రజత్ పటీదార్, శ్రీకర్ భారత్ (కీపర్) కైల్ జమీసన్/టిమ్ డేవిడ్, హర్షల్ పటేల్, నవదీప్ సైని/షాబాజ్ అహ్మద్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్

ముంబయి ఇండియన్స్‌ ప్లేయింగ్ XI అంచనా: క్వింటన్ డి కాక్ (కీపర్), రోహిత్ శర్మ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కిరన్ పొలార్డ్, కృనాల్ పాండ్య, హార్దిక్ పాండ్యా/సౌరభ్ తివారీ, ఆడమ్ మిల్నే, రాహుల్ చాహర్, జస్ప్రిత్ బుమ్రా ట్రెంట్ బౌల్ట్

Also Read: CSK vs KKR IPL 2021 Match Prediction: ధోని వర్సెస్ వెంకటేష్ అయ్యర్.. హోరాహోరీగా నేటి మ్యాచ్.. సమఉజ్జీల సమరంలో గెలిచేదెవరో?

Highlights of IPL Match Result, DC vs RR: ఢిల్లీకి ఎదురే లేదు.. రాజస్థాన్‌పై 33 పరుగుల తేడాతో ఘన విజయం