MI vs RR IPL 2022 Match Preview: తొలి విజయం కోసం ముంబై.. ఆధిపత్య ధోరణితో రాజస్థాన్.. ప్లేయింగ్ XI కీలక మార్పులు..

|

Apr 02, 2022 | 6:10 AM

Mumbai Indians vs Rajasthan Royals Predicted Playing XI: ముంబై ఇండియన్స్ తన మొదటి మ్యాచ్‌లో ఓటమిని ఎదుర్కోంది. అలాగే రాజస్థాన్ రాయల్స్ టీం IPL 2022ను విజయంతో ప్రారంభించింది.

MI vs RR IPL 2022 Match Preview: తొలి విజయం కోసం ముంబై.. ఆధిపత్య ధోరణితో రాజస్థాన్.. ప్లేయింగ్ XI కీలక మార్పులు..
Mi Vs Rr Playing Xi Ipl 2022
Follow us on

ఐపీఎల్ (IPL 2022) లో ఐదుసార్లు విజేత ముంబై ఇండియన్స్(Mumbai Indians) శనివారం రాజస్థాన్ రాయల్స్‌(Rajasthan Royals)తో తలపడనుంది. ముంబై జట్టుకు అనుకున్న రీతిలో ఆరంభం కాలేదు. అయితే తొలి మ్యాచ్‌లో ఓడిపోవడం ముంబై ఇండియన్స్‌కు కలిసిసొచ్చే అంశమేనని ఫ్యాన్స్ భావిస్తున్నారు. తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమి చవిచూసిన ముంబై.. ఐపీఎల్‌లో తన తొలి మ్యాచ్ ఓటముల చరిత్రను అలాగే ఉంచుకుంది. మరోవైపు సంజూ శాంసన్‌ సారథ్యంలోని రాజస్థాన్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై విజయం సాధించింది. ముంబై తమ తొలి మ్యాచ్‌లో ఢిల్లీతో గెలుపొందాలని ప్లాన్ చేసినా.. లలిత్ ఉపాధ్యాయ్, అక్షర్ పటేల్ చివరి ఓవర్‌లో అద్బుతంగా ఆడి ముంబై చేతుల నుంచి విజయాన్ని లాగేసుకున్నారు. అదే సమయంలో రాజస్థాన్‌కు తొలి మ్యాచ్‌లో విజయం సాధించడంలో ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఆ జట్టు తన తొలి మ్యాచ్‌లో హైదరాబాద్‌ను సులువుగా ఓడించింది.

ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌ను ఓడించడం ద్వారా ముంబై తమ విజయ ఖాతా తెరవాలని కోరుకుంటుండగా, మరోవైపు సంజూ శాంసన్ కూడా మొదటి మ్యాచ్‌లో ఆధిపత్య ప్రదర్శనను చూపించాలని కోరుకుంటున్నాడు. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.

సూర్యకుమార్ రాకతో బలపడిన ముంబై..

ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల ప్లేయింగ్ ఎలెవన్ గురించి మాట్లాడితే, ముంబై ఇండియన్స్‌కు పెద్ద ప్రయోజనం ఉంటుంది. మిడిల్ ఆర్డర్‌లో కీలక బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్ నుంచి పునరాగమనం చేస్తున్నాడు. గాయం కారణంగా సూర్యకుమార్ గత మ్యాచ్‌లో ఆడలేదు. అయితే అతను ఈ మ్యాచ్‌లో పునరాగమనం చేసేందుకు సిద్ధమయ్యాడు. అతని రాక జట్టు బ్యాట్స్‌మెన్‌కు చాలా బలాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు. అన్మోల్‌ప్రీత్ సింగ్ స్థానంలో సూర్యకుమార్‌ను జట్టులోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు, బౌలింగ్‌లో చూస్తే, డేనియల్ సామ్స్‌ను డ్రాప్ చేయవచ్చు. తొలి మ్యాచ్‌లోనే అత్యంత ఖరీదైన వాడిగా నిరూపించుకున్నాడు. నాలుగు ఓవర్లలో 14.25 సగటుతో 57 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.

రాజస్థాన్‌లో మార్పులకు అవకాశం తక్కువే..

మరోవైపు, రాజస్థాన్ జట్టును పరిశీలిస్తే, మొదటి మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ రెండూ భీకరంగా ఉన్నాయి. జోస్ బట్లర్‌తో పాటు కెప్టెన్ సంజూ శాంసన్, దేవదత్ పడిక్కల్ రాణించి అర్ధ సెంచరీలు చేశారు. అదే సమయంలో, ట్రెంట్ బౌల్ట్ నుంచి యుజ్వేంద్ర చాహల్ వరకు, రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో అద్భుతాలు చేశారు.

ఆధిపత్యం ఎవరిదంటే?

డాక్టర్ డివై పాటిల్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య 26వ మ్యాచ్ కానుంది. ఇప్పటివరకు జరిగిన 25 మ్యాచ్‌ల ఫలితాలను ఓసారి చూద్దాం. 25 మ్యాచ్‌ల్లో ముంబై 13 మ్యాచ్‌లు గెలుపొందగా, రాజస్థాన్ రాయల్స్ 11 మ్యాచ్‌లు గెలిచింది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.

రెండు జట్ల XI ప్లేయింగ్..

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్, టిమ్ డేవిడ్, డేనియల్ సామ్స్, మురుగన్ అశ్విన్, టైమల్ మిల్స్, జస్ప్రీత్ బుమ్రా, బాసిల్ థంపి.

రాజస్థాన్ రాయల్స్: సంజు శాంసన్ (కెప్టెన్, కీపర్), దేవదత్ పడిక్కల్, షిమ్రోన్ హెట్మెయర్, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, జోస్ బట్లర్, రవిచంద్రన్ అశ్విన్, నాథన్ కౌల్టర్-నైల్, ప్రసిద్ధ్ కృష్ణ, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్.

Also Read: 9 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులు.. 340పైగా స్ట్రైక్‌రేట్.. కేకేఆర్ బౌలర్ల పాలిట పీడకలగా మారిన పంజాబ్ బ్యాటర్..

KKR vs PBKS Live Score, IPL 2022: టాస్ గెలిచిన కోల్ కతా.. పంజాబ్ పై ఆధిపత్యం చెలాయిస్తుందా?