LSG VS SRH IPL 2022 Match Preview: హైదరాబాద్ సత్తా చాటేనా.. లక్నోతో పోరుకు సిద్ధం.. ప్లేయింగ్ XIలో కీలక మార్పులు

|

Apr 04, 2022 | 6:23 AM

Lucknow Super Giants vs Sunrisers Hyderabad Predicted Playing XI: ఐపీఎల్ -2022 (IPL 2022) లో, కేఎల్ రాహుల్ సారథ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్ జట్టు సోమవారం కేన్ విలియమ్సన్ సారథ్యంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది.

LSG VS SRH IPL 2022 Match Preview: హైదరాబాద్ సత్తా చాటేనా.. లక్నోతో పోరుకు సిద్ధం.. ప్లేయింగ్ XIలో కీలక మార్పులు
Lsg Vs Srh Playing Xi Ipl
Follow us on

ఐపీఎల్ -2022 (IPL 2022) లో, కేఎల్ రాహుల్ సారథ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్ జట్టు సోమవారం కేన్ విలియమ్సన్ సారథ్యంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్‌(LSG VS SRH)తో తలపడనుంది. అంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్‌‌తో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో లక్నో విజయం సాధించింది. అయితే, మొదటి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై ఓటమి చవిచూడాల్సి వచ్చింది. మరోవైపు, సన్‌రైజర్స్ ఇప్పటివరకు ఒకే ఒక మ్యాచ్ ఆడగా, రాజస్థాన్ రాయల్స్ ఎస్‌ఆర్‌హెచ్‌ను ఓడించింది. ఈసారి ఈ రెండు జట్లు డీవై పాటిల్ స్టేడియంలో తలపడనున్నాయి. ఈ సీజన్‌లో ఈ మైదానంలో ఇరు జట్లకు ఇదే తొలి మ్యాచ్. లక్నో జట్టు విన్నింగ్ ఆర్డర్‌ను కొనసాగించేందుకు ప్రయత్నిస్తుండగా, సన్‌రైజర్స్ జట్టు విజయం ఖాతా తెరవాలనుకుంటోంది.

తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌కు ఏమీ బాగాలేదు. జట్టు బ్యాటింగ్‌ కానీ, బౌలింగ్‌ కానీ ఆకట్టుకోలేదు. ఇటువంటి పరిస్థితిలో హైదరాబాద్ టీం రెండు రంగాలలో మెరుగుపడటం అవసరం. అదే సమయంలో, లక్నోకు చివరి మ్యాచ్ అద్భుతంగా ఉంది. తొలి మ్యాచ్‌లోనూ రాణించి చివరి క్షణాల్లో ఓడిపోయింది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో మార్పులు..

తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ జట్టు పరాజయం పాలైంది. ఈ జట్టు తమ అత్యుత్తమ ప్లేయింగ్ XIని ఎంచుకోవాల్సి ఉంటుంది. లక్నోపై విలియమ్సన్ కొన్ని మార్పులు చేయాలని కోరుకుంటుంది. DY పాటిల్ స్టేడియం పిచ్‌పై బ్యాట్స్‌మెన్‌లకు సహాయకారిగా ఉంటుంది. అదే సమయంలో స్పిన్నర్లకు కూడా హెల్ప్ ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో, విలియమ్సన్ వాషింగ్టన్ సుందర్‌తో పాటు మరో స్పిన్నర్‌ను తన జట్టులో చేర్చుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో శ్రేయాస్‌ గోపాల్‌కు జట్టులో అవకాశం దక్కుతుంది. అతను జట్టులో టి. నటరాజన్ లేదా ఉమ్రాన్ మాలిక స్థానంలో ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది.

లక్నో అదే టీంతో..

చెన్నైపై లక్నో పటిష్ట ప్రదర్శన చేసింది. జట్టు విజయంలో ఆటగాళ్లంతా సహకరించారు. ఇటువంటి పరిస్థితిలో, కెప్టెన్ KL రాహుల్ గత మ్యాచ్‌లో గెలిచిన అదే జట్టుతో బరిలోకి దిగనుంది.

ఈ రెండు జట్లు తొలిసారిగా తలపడుతున్నాయి. అయితే ఈ రెండు జట్ల ఆటగాళ్లు గతంలో కూడా ఒకరిపై ఒకరు తలపడ్డారు. లక్నో ఓపెనర్ క్వింటన్ డి కాక్ ఇప్పటివరకు హైదరాబాద్‌పై 10 ఇన్నింగ్స్‌లలో 371 పరుగులు చేశాడు. హైదరాబాద్‌పై కేఎల్ రాహుల్ 10 ఇన్నింగ్స్‌ల్లో 265 పరుగులు చేశాడు.

రెండు జట్ల ప్లేయింగ్ XI ఇలా ఉండొచ్చు..

సన్‌రైజర్స్ హైదరాబాద్ – కేన్ విలియమ్సన్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నికోలస్ పూరన్ (కీపర్), ఐడెన్ మార్క్‌రామ్, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, రొమారియా షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, శ్రేయాస్ గోపాల్.

లక్నో సూపర్ జెయింట్స్ – కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (కీపర్), ఎవిన్ లూయిస్, మనీష్ పాండే, దీపక్ హుడా, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, ఆండ్రూ టై, దుష్మంత చమీరా, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్.

Also Read: IPL 2022: ధోని ముందు కుప్పిగంతులా? మెరుపు వేగంతో రాజపక్సేను ఎలా రనౌట్‌ చేశాడో మీరే చూడండి..

IPL 2022: ఢిల్లీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. తదుపరి మ్యాచ్‌కు జట్టులో చేరనున్న ఆ స్టార్‌ ఆటగాళ్లు!..