మరో 3 రోజుల్లో టీ20 వరల్డ్‌కప్ ముగియనుంది. మరికొద్ది గంటల్లో ఫైనల్ బెర్త్ కోసం నాలుగు జట్లు పోటీ పడనున్నాయి. భారత కాలమాన ప్రకారం.. మొదటి సెమీఫైనల్ మ్యాచ్ దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జూన్ 27 ఉదయం 6 గంటలకు జరగనుండగా.. రెండో సెమీఫైనల్ మ్యాచ్ భారత్, ఇంగ్లాండ్ మధ్య గురువారం రాత్రి 8 గంటలకు జరుగుతుంది. అయితే ఈ రెండు మ్యాచ్‌లకు వరుణుడు అడ్డంకిగా మారే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. అందుతున్న వెదర్ రిపోర్ట్ ప్రకారం.. ట్రినిడాడ్, గయానాలో నిరంతరం వర్షం కురవనుందని తెలుస్తోంది. దీన్ని బట్టి ఒకవేళ సెమీఫైనల్స్ రెండూ రద్దయితే.. ఏయే జట్లు ఫైనల్స్‌కి వెళ్తాయో.? ఐసీసీ నిబంధనలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
వర్షం పడితే.. ముందుగా దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్‌కు 90 నిమిషాలు అదనంగా ఇవ్వడంతో పాటు.. ఓ రిజర్వ్ డేను కూడా కేటాయించారు. మొదటి రోజు ఎక్కడైతే వర్షం పడినప్పుడు ఆట ఆగుతుందో.. తిరిగి అక్కడ నుంచే రిజర్వ్ డే ఆట కొనసాగుతుంది. ఇక భారత్, ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్‌కి రిజర్వ్ డే లేదు. మ్యాచ్ రోజు వర్షం పడితే.. ఎక్స్‌ట్రా 250 నిమిషాలు కేటాయించింది ఐసీసీ.. అంటే.. అసలు 190 నిమిషాలతో పాటు అదనంగా 4 గంటల 10 నిమిషాలు ఈ మ్యాచ్ కోసందొరుకుతుంది.
ఈ అదనపు సమయంలోనూ వర్షం పడి.. రెండు నాకౌట్ మ్యాచ్‌లు రద్దయితే.. సూపర్ 8 దశలో రెండు గ్రూప్‌లలోనూ అగ్రస్థానంలో నిలిచిన జట్లు.. అంటే.. భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఇక ఫైనల్ మ్యాచ్‌లోనూ వర్షం ముప్పు ఉంటే.. రెండు జట్లను విజేతగా ప్రకటించనుంది ఐసీసీ.
Rampant Afghanistan go against undefeated South Africa in the first semi-final of Men’s #T20WorldCup 🔥#SAvAFGhttps://t.co/cll5ZOgC41
— ICC (@ICC) June 26, 2024
Defending champions England square off against impressive India in the second semi-final in Guyana 👊#T20WorldCup | #INDvENGhttps://t.co/3m5Pvz91vJ
— ICC (@ICC) June 26, 2024
ఇది చదవండి: కోహ్లీ స్థానంలో టీ20 మాన్‌స్టర్.. సెమీస్‌కు ముందుగా టీమిండియాలో కీలక మార్పులు
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..