West Indies Spinner Jada James Injury Video: శుక్రవారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మహిళల టీ20 ప్రపంచ కప్ 2024 మ్యాచ్‌లో వెస్టిండీస్ స్పిన్ బౌలర్ జైదా జేమ్స్ తీవ్రంగా గాయపడింది. దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వూల్వార్డ్ కొట్టిన ఓ బంతి ఊహించని విధంగా దవడకు తగిలి గాయపడింది. దీనికి సంబంధించిన వీడియోను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఈ సంఘటన ఇన్నింగ్స్ రెండవ ఓవర్‌లో చోటు చేసుకుంది. బంతి నేరుగా వెళ్లి బౌలర్‌కు తగిలింది. బంతిని క్యాచ్ చేసే క్రమంలో ఈ 19 ఏళ్ల ప్లేయర్ దవడకు తాకింది. దీంతో ఆమెకు మైదానంలో చికిత్స చేయాల్సి వచ్చింది. జేమ్స్ దవడ వాచిపోయింది. గాయం తీవ్రం కావడంతో మిగతా ఓవర్ వేయలేకపోయింది. మరో ప్లేయర్ కియానా జోసెఫ్ మిగిలిన ఐదు బంతులు బౌల్ చేసింది.
కాగా, ఈ మ్యాచ్‌లో ప్రోటీస్ మహిళలు తొలి విజయాన్ని నమోదు చేసి, టీ20 ప్రపంచకప్‌లో ఘనమైన ఆరంభాన్ని అందుకున్నారు. సౌతాఫ్రికా ప్లేయర్లలో వూల్‌వార్డ్ (59*), తజ్మిన్ బ్రిట్స్ (57*) అర్ధ సెంచరీలతో కీలకంగా మారారు. అంతకుముందు, నాన్‌కులులేకో మ్లాబా 4-0-29-4తో అద్బుత బౌలింగ్‌తో కరీబియన్లు 20 ఓవర్లలో 118/6కి కుప్పకూలారు. స్టాఫానీ టేలర్ మాత్రమే 44 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..