వికెట్ తీయలేదు, క్యాచ్ పట్టలేదు.. అనూహ్యంగా ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు పొందాడు.. ఆ బౌలర్ ఎవరంటే.!

|

Feb 09, 2021 | 5:37 PM

Bowler Cameron Cuffy: క్రికెట్‌ అంటేనే ఎంతో ఆసక్తికరమైన ఆట.. అప్పుడప్పుడూ చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. అప్పటి వరకు గెలుస్తుందనుకున్న..

వికెట్ తీయలేదు, క్యాచ్ పట్టలేదు.. అనూహ్యంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొందాడు.. ఆ బౌలర్ ఎవరంటే.!
Follow us on

Bowler Cameron Cuffy: క్రికెట్‌ అంటేనే ఎంతో ఆసక్తికరమైన ఆట.. అప్పుడప్పుడూ చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. అప్పటి వరకు గెలుస్తుందనుకున్న జట్టు అంతలోనే ఓడిపోవచ్చు. ఓటమి అంచుల్లో ఉన్న జట్టు ఒక్కసారిగా విజయాన్ని అందుకోవచ్చు. అలాగే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు కూడా అనూహ్యంగా ఒకరికి దక్కాల్సింది మరొకరు దక్కించుకోవచ్చు. ఇక ఇలా క్రికెట్‌లో జరిగిన ఓ విచిత్రం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం..

అది 2001వ సంవత్సరం జూన్ 23వ తేదీ.. జింబాబ్వే, వెస్టిండీస్ జట్ల మధ్య కోకాకోలా కప్ టోర్నమెంట్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఎంతో మంచి ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు వరించని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు.. వికెట్ తీయని.. క్యాచ్ పట్టని కామెరాన్ కఫ్ఫీకి దక్కింది. ఈ మ్యాచ్‌లో కఫ్ఫీ 10 ఓవర్లు వేయగా.. అందులో 20 పరుగులతో పాటు 2 మైడెన్ల ఉన్నాయి. కఫ్ఫీ మాదిరిగా మిగతా ఏ బౌలర్ కూడా పొదుపుగా బౌలింగ్ చేయలేదు. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ ఐదు వికెట్లకు 266 పరుగులు సాధించగా, ఆతిథ్య జట్టు 239 పరుగులు మాత్రమే చేయగలిగింది. కామెరాన్ కఫ్ఫీ తన కెరీర్‌లో 15 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 43 వికెట్లు పడగొట్టగా, 41 వన్డేల్లో 41 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ విషయానికొస్తే, కఫ్ఫీ 86 మ్యాచ్‌లు ఆడి 252 వికెట్లు తీశాడు.