MS Dhoni-CSK: చెన్నై సూపర్ కింగ్స్‌ని ఐపీఎల్ 16వ సీజన్ విజేతగా నిలిపిన వెంటనే మోకాలి చికిత్స చేయించుకున్నాడు ఎంఎస్ ధోని. ఈ నేపథ్యంలో ధోని వచ్చే సీజన్‌లో ఐపీఎల్ ఆడతాడో లేదో అన్న భయం ప్రతి క్రికెట్ అభిమానిలోనూ ఉంది. సీజన్ మధ్యలో నుంచే ధోని మోకాలి నొప్పితో బాధపడినప్పటికీ ప్రతి మ్యాచ్‌లోనూ అభిమానుల ముందుకు వచ్చాడు. ఈ విషయంపై చెన్న సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ సీఈఓ కాశీ విశ్వనాథన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంకా తదుపరి సీజన్‌లో ధోని ఆడే విషయంపై కూడా మాట్లాడారు.
విశ్వనాథన్ మాట్లాడుతూ ధోని మోకాలి నొప్పితో బాధపడుతున్నప్పటికీ తమకు ఎప్పుడూ కంప్లైంట్ చేయలేదని
మ్యాచ్ ఆడమని అతన్ని ఎప్పుడూ అడగలేదని, తాను ఫిట్‌గా లేకపోతే టీమ్‌కి ముందుగానే చెప్పేవాడని తనకు తెసుసని అన్నారు. ఇంకా ‘ధోని ఆడడం కష్టమనిమాకు తెలుసు. కానీ జట్టు పట్ల అతని నిబద్ధత, నాయకత్వం కారణంగా టీమ్ ఎంతగా లాభపడుతుందో అందరికీ తెలుసు. ఆ కోణంలో ఎవరైనా ధోనిని అభినందించాలి. సీజన్ పూర్తయ్యే వరకు తన నొప్పి గురించి ఎవరికీ చెప్పలేదు. ఆ తర్వాత సర్జరీ చేయించుకున్నాడు. సర్జరీ విజయవంతం అయినందుకు సంతోషంగా ఉంది. అతను కోలుకుంటున్నాడు’ అని అన్నారు.
Watching and learning with some Yellove in the middle! ?#WhistlePodu #Yellove ?? @msdhoni @deepak_chahar9 pic.twitter.com/DMGq2D8S8o
— Chennai Super Kings (@ChennaiIPL) June 20, 2023
అలాగే ‘తనకు బాడీ ఫిట్‌నెస్ సహకరిస్తే మరో సంవత్సరం క్రికెట్ ఆడాలని ధోని కోరుకుంటున్నాడు. సర్జరీ నుంచి కోలుకున్న వెంటనే వచ్చే సీజన్ కోసం శిక్షణ ప్రారంభించాలని భావిస్తున్నాడు. వాస్తవానికి 16వ సీజన్ ముగిసిన వెంటనే ముంబైలో సర్జరీ చేయించుకుని, రిహాబిటేషన్ కోసం రాంచీకి వెళ్తానని మాకు చెప్పాడు. ముంబైలో నేను ధోనిని కలిశాను. అతను కోలుకుంటున్నాడు. ముఖ్యంగా ధోనికి ఏం చేయాలో మాగా తెలుసు. కాబట్టి తన నిర్ణయం గురించి ప్రశ్నించే అవసరం లేదు. 2008 నుంచి కూడా ఇదే జరుగుతుంది’ అని విశ్వనాథన్ వెల్లడించారు.
What If….! ??#SelfieDay #WhistlePodu ?? pic.twitter.com/Jh7bn18hhX
— Chennai Super Kings (@ChennaiIPL) June 21, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..