IPL 2022 Auction: ఐపీఎల్- 2022 మెగా వేలం(IPL 2022 Mega Auction) ముందు పంజాబ్ కింగ్స్ భారీ షాక్ ఇచ్చాడు ఆ జట్టు బ్యాటింగ్ కోచ్. బ్యాటింగ్ కోచ్ బాధ్యతలు నుంచి వసీం జాఫర్(wasim jaffer) తప్పుకున్నాడు. ఈ విషయాన్ని జాఫర్ సోషల్ మీడియాలో వెల్లడించాడు. డిఫరెంట్‌గా ట్వీట్ చేసి బ్యాటింగ్ కోచ్‌గా తప్పుకుంటున్నట్లు చెప్పాడు. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్(Ranveer kapoor) నటించిన ఏ దిల్ హై ముష్కిల్ సినిమా నుంచి ఓ మీమ్‌ను షేర్ చేస్తూ ఫ్రాంఛైజీ నుంచి విడిపోతున్నట్లు వెల్లడించాడు.
“పంజాబ్ కింగ్స్ యాజమాన్యానికి కృతజ్ఞతలు. ఇన్ని రోజులు కలిసి పని చేసినందుకు సంతోషంగా ఉంది. రాబోయే సీజన్‌లో అద్భుతంగా రాణించాలని ఆశిస్తున్నాను. పంజాబ్ కింగ్స్‌కు ఆల్‌ది బెస్ట్” అని జాఫర్ ట్వీట్ చేశాడు.
వసీం జాఫర్ భారత్ తరఫున టెస్టుల్లో ఓపెనర్‌గా ఆడాడు. రంజీ ట్రోఫీలో 150 మ్యాచ్‌లు ఆడిన మొదటి ఆటగాడిగా జాఫర్ నిలిచాడు. 2019 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కు బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన అతను 2021 సీజన్ వరకు కొనసాగాడు. పంజాబ్ కింగ్స్ మెగా వేలానికి ముందు మయాంక్ అగర్వాల్, అర్షదీప్‌ను రీటైన్ చేసుకుంది. పంజాబ్ కింగ్స్‌కు గుడ్‌బై చెప్పి కేఎల్ రాహుల్ లక్నోకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఐపీఎల్ 2022 మెగా వేలం బెంగళూరు వేదికగా ఈ నెల 12,13 తేదీల్లో మెగా వేలం జరగనుంది.
Read Also.. IPL 2022: IPL వేలానికి ముందు పంజాబ్ కింగ్స్‌కి షాక్.. బ్యాటింగ్ కోచ్ రాజీనామా..?