Video: అచ్చం తండ్రిలాగే.. టీమిండియా బౌలర్‌ను ఉతికి ఆరేసిన సెహ్వాగ్‌ పెద్ద కొడుకు!

ఆర్యవీర్ సెహ్వాగ్, వీరేందర్ సెహ్వాగ్ కుమారుడు, తన ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (DPL) అరంగేట్రంలో తండ్రి బ్యాటింగ్ శైలిని ప్రతిబింబించాడు. నవదీప్ సైనీ, రౌనక్ వాఘేలా లాంటి బౌలర్లను ఎదుర్కొని, వరుస ఫోర్లతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతని అద్భుతమైన ప్రదర్శన తండ్రి భయంలేని బ్యాటింగ్ ను గుర్తుచేసింది.

Video: అచ్చం తండ్రిలాగే.. టీమిండియా బౌలర్‌ను ఉతికి ఆరేసిన సెహ్వాగ్‌ పెద్ద కొడుకు!
Aryavir Sehwag And Virender

Updated on: Aug 28, 2025 | 8:40 AM

టీమిండియా మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌.. ఫియర్‌లెస్‌ బ్యాటింగ్‌కు మారుపేరు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడినంత కాలం భయమంటే ఏంటో తెలియని ప్లేయర్‌లాగా ఆడాడు. అతని బ్యాటింగ్‌ ప్రపంచ వ్యాప్తంగా సెపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్‌ అయి 10 ఏళ్లు గడుస్తున్న తర్వాత ఇప్పుడు సెహ్వాగ్‌ గురించి ఎందుకు చెబుతున్నారు అని అనుకుంటున్నారా? ఇన్నేళ్ల తర్వాత మళ్లీ అతని రక్తం అచ్చం అతనిలానే ఆడుతుంటే క్రికెట్‌ అభిమానుల కళ్ల ముందు ఒక్కసారిగా సెహ్వాగ్‌ కనిపించాడు. అతని పెద్ద కొడుకు ఓ టీమిండియా బౌలర్‌ను వరుస ఫోర్లతో ఉతికి ఆరేశాడు. అచ్చం తండ్రిలానే ఫియర్‌లెస్‌ బ్యాటింగ్‌తో.. క్రికెట్‌ ఊపరి పీల్చుకో సెహ్వాగ్‌ తిరిగొచ్చాడు అంటూ ఓ హోప్‌ ఇచ్చాడు.

న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (DPL)లో సెహ్వాగ్ పెద్ద కొడుకు ఆర్యవీర్‌ సెహ్వాగ్‌ తన అరంగేట్రం మ్యాచ్‌తోనే ఆకట్టుకున్నాడు. తన తండ్రిలాగే ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆర్యవీర్ మూడో ఓవర్ ప్రారంభంలో సీనియర్‌ బౌలర్‌ నవదీప్ సైనీపై సీనియర్ సెహ్వాగ్ ను గుర్తుకు తెచ్చే విధంగా అద్భుతమైన స్ట్రోక్ ప్లేను ప్రదర్శించాడు. సైనీ వేసిన తొలి బంతిని డీప్ ఎక్స్‌ట్రా కవర్ ద్వారా బౌండరీగా మలిచాడు. బంతి ఆఫ్‌సైడ్ ద్వారా ఇన్‌ఫీల్డ్ మీదుగా వెళ్లింది. తర్వాతి బంతిలో ట్రాక్‌పై నృత్యం చేస్తూ ఎక్స్‌ట్రా కవర్, లాంగ్-ఆఫ్ మధ్య పంచ్ చేసి రెండవ వరుస ఫోర్ కొట్టాడు.

మళ్ళీ ఒక ఓవర్ తర్వాత ఎడమచేతి వాటం స్పిన్నర్ రౌనక్ వాఘేలా బౌలింగ్‌లో అతను మొదటి బౌలింగ్‌ను థర్డ్ మ్యాన్ ద్వారా, రెండవ బౌలింగ్‌ను లాంగ్-ఆన్ వైపుకు బాదాడు. అయితే అదే ఓవర్‌లో 16 బంతుల్లో 22 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కానీ, ఉన్నంత సేపు మాత్రం మంచి వినోదం అందించాడు. తొలి మ్యాచ్‌ ఆడుతున్నాననే భయం లేకుండా రెచ్చిపోయాడు. DPL 2025 వేలంలో సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ రూ.8 లక్షలకు ఆర్యవీర్‌ను కొనుగోలు చేసింది. గత సంవత్సరం అతను వినూ మన్కడ్ ట్రోఫీలో ఢిల్లీ తరపున అద్భుతమైన అరంగేట్రం చేశాడు, జట్టు ఆరు వికెట్ల విజయంలో 49 పరుగులు చేశాడు. ఆ తర్వాత కూచ్ బెహార్ ట్రోఫీలో మేఘాలయపై 229 బంతుల్లో 34 ఫోర్లు, 2 సిక్సర్లతో అజేయంగా 200 పరుగులు సాధించాడు. మొత్తంగా 309 బంతుల్లో 297 పరుగులు (51 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి కేవలం మూడు పరుగుల తేడా ట్రిపుల్‌ సెంచరీ చేసే అవకాశం కోల్పోయాడు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి