తిండి కోసం రూపాయి రూపాయి దాచుకుంటూ..! కోహ్లీ జీవితంలో కన్నీళ్లు పెట్టించే క్షణాలు..

విరాట్ కోహ్లీ తొలినాళ్ల జీవితాన్ని అతని స్నేహితుడు ఇషాంత్ శర్మ వెల్లడించాడు. అండర్-19 క్రికెట్ రోజుల్లో, ఆహారం కోసం ప్రతి పైసా ఆదా చేసే విరాట్ కష్టాలను ఇషాంత్ ప్రస్తావించాడు. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన క్రికెటర్ అయిన విరాట్ గురించి అనేక విషయాలు చెప్పాడు.

తిండి కోసం రూపాయి రూపాయి దాచుకుంటూ..! కోహ్లీ జీవితంలో కన్నీళ్లు పెట్టించే క్షణాలు..
Virat Kohli

Updated on: May 18, 2025 | 5:30 PM

విరాట్ కోహ్లీ ఎవరు? అని క్రికెట్‌ అభిమానులను అడిగితే కొందరు అతన్ని క్రికెట్ సూపర్ స్టార్ అని, మరికొందరు ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన క్రికెటర్ అని, రూ.1050 కోట్ల నికర విలువ కలిగిన వ్యక్తి అని చెప్పొచ్చు. కానీ ఈ మైలురాయిని చేరుకున్న విరాట్ ఒకప్పుడు ఆహారం కోసం ప్రతి పైసా ఆదా చేశాడని మీకు తెలుసా? కోహ్లీ జీవితంలోని కఠినమైన రోజుల గురించి అతని సన్నిహితుడు, ఆ టైమ్‌లో కూడా తోడున్న మిత్రుడు, టీమిండియా వెటరన్‌ క్రికెటర్‌ ఇషాంత్ శర్మ వెల్లడించాడు.

విరాట్ కోహ్లీతో తనకున్న సంబంధం గురించి ఇషాంత్ శర్మ మాట్లాడుతూ.. విరాట్ ప్రపంచానికి సూపర్ స్టార్ కావచ్చు, కానీ, నేను అతన్ని అలా చూడను. నాకు అతను నా చిన్ననాటి స్నేహితుడు. కోహ్లీ తనకు ఇప్పటికీ చికూ అనే అని అన్నాడు. 36 ఏళ్ల ఇషాంత్ శర్మ ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌కు ఒక రోజు ముందు మాట్లాడుతూ.. అండర్ 19 క్రికెట్ రోజుల్లో తాను, విరాట్ కలిసి గది, ఆహారం పంచుకునేవారని చెప్పాడు. తన అండర్-19 క్రికెట్ రోజుల్లో విరాట్ ఆహారం కోసం ప్రతి పైసా ఆదా చేసేవాడని, ఈ విషయంలో అతనికి మద్దతు ఇచ్చేవాడని ఇషాంత్ చెప్పాడు.

మేం ఎంత డబ్బు ఆదా చేశామో లెక్కించేవాళ్ళమని ఆయన అన్నారు. విరాట్ కోహ్లీ అందరికీ భిన్నంగా ఉంటాడని ఇషాంత్‌ తెలిపాడు. ఇద్దరు ఢిల్లీకి చెందిన క్రికెటర్లే. చాలా ఏళ్లు డొమెస్టిక్‌ క్రికెట్‌లో కలిసి క్రికెట్‌ ఆడారు. ఇద్దరూ కలిసి ఇండియా కూడా ఆడారు. కోహ్లీతో తనకున్న అనుబంధాన్ని ఇషాంత్‌ అనేకసార్లు వెల్లడించాడు. అలాగే విరాట్‌ కోహ్లీ సైతం తాను ఏ విషయమైన పంచుకోగలిగే వ్యక్తి ఇషాంత్‌ శర్మ అంటూ తెలిపాడు. అంటే వారిద్దరి మధ్య అంత అనుబంధం ఉంది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..