
భారత్ వేదికగా జరిగే ప్రపంచ కప్ 2023 మెగా టోర్నీ కోసం అఫ్గానిస్తాన్ తన జట్టును ప్రకటించింది. అక్టోబర్ 5 నుంచి ప్రాంరభమయ్యే ఈ టోర్నీలో ఆఫ్గాన్ జట్టును హష్మతుల్లా షాహిదీ నడిపించనున్నాడు. 15 మందితో కూడిన అఫ్గానిస్తాన్ జట్టులో రహ్మతుల్లా గుర్బాజ్, మహ్మద్ నబి, రషిద్ ఖాన్, నూర్ అహ్మద్, అబ్దుల్ రెహ్మాన్ వంటి ఆటగాళ్లకు అవకాశం లభించింది. అయితే ఈ జట్టులో క్రికెట్ అభిమానులకు, నెటిజన్లకు సంతోషం కలిగించే విషయం ఏమిటంటే.. నవీన్ ఉల్ హక్కి కూడా జట్టులో అఫ్గానిస్తాన్ సెలెక్టర్స్ స్థానం కల్పించారు. ఐపీఎల్ 2023 టోర్నీలో విరాట్ కోహ్లీతో గొడవ పడిన నవీన్.. ప్రపంచ కప్ వేదిగా మళ్లీ కింగ్ కంట పడబోతున్నాడు. దీంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.
విశేషం ఏమిటంటే.. వరల్డ్ కప్‌లో భారత్ vs ఆఫ్గాన్ మ్యాచ్ కింగ్ కోహ్లీ సొంత మైదానంలోనే జరగబోతోంది. అక్టోబర్ 11న న్యూ ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వనుంది. దీంతో తమ ముందు నవీన్ ఉల్ హక్‌ని కోహ్లీ ఉతికేయాలని ఢిల్లీలోని క్రికెట్ అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ‘పాకిస్తాన్ క్రికెట్ బోర్డు గొప్పగా చెప్పుకునే షాహీన్ ఆఫ్రిదీ, నసీమ్ షా వంటి బౌలర్లనే కింగ్ కోహ్లీ ఉతికేశాడు, జట్టులో స్థానమే అనుమానంగా ఆడే నవీన్ ఎంత’ అన్నట్లుగా పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇంకా రకరకాల మీమ్స్‌తో సందడి చేసుకుంటున్నారు. వాటిపై ఓ లుక్ వేద్దాం..
పండగే..
మజా ఆయేగా..
రౌండ్ 2..
మసాలా సరిపోద్దిగా..
సిద్ధమవ్వండి..
ఇదేగా కావాల్సింది..
రిపీట్ అవ్వాల్సిందే..
ఉతుకుడే..
వరల్డ్ కప్ కోసం ఆఫ్గానిస్తాన్ జట్టు: హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), రహ్మతుల్లా గుర్బాజ్, ఇబ్రహిమ్ జద్రాన్, రియాజ్ హాసన్, రహ్మత్ షా, నజిబుల్లా జద్రాన్, మహ్మద్ నబి, ఇక్రమ్ అలిఖిల్, అజ్మతుల్లా ఒమర్జై, రషిద్ ఖాన్, ముజిబ్ ఉర్ రెహ్మాన్, నూర్ అహ్మద్, ఫజల్హక్ ఫరుఖీ, అబ్దుల్ రెహ్మాన్, నవీన్ ఉల్ హక్