Virat Kohli: తొలిసారి ఆమెను చూసి భయపడ్డా.. మాట కలుపుదామని, జోక్ చేస్తే.. నాపైనే పంచ్ వేసింది: విరాట్ కోహ్లీ

|

Mar 22, 2023 | 6:07 AM

భారత క్రికెట్ జట్టు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మంగళవారం యూట్యూబ్‌లో ఏబీ డివిలియర్స్‌తో కలిసి 'ది 360 షో' కోసం లైవ్ సెషన్‌లో మాట్లాడాడు. ఈ సందర్భంగా ఏబీ, కోహ్లీ మధ్య పలు కీలక విషయాల గురించి మనసు విప్పి మాట్లాడారు.

Virat Kohli: తొలిసారి ఆమెను చూసి భయపడ్డా.. మాట కలుపుదామని, జోక్ చేస్తే.. నాపైనే పంచ్ వేసింది: విరాట్ కోహ్లీ
Virat Kohli
Follow us on

భారత క్రికెట్ జట్టు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మంగళవారం యూట్యూబ్‌లో ఏబీ డివిలియర్స్‌తో కలిసి ‘ది 360 షో’ కోసం లైవ్ సెషన్‌లో మాట్లాడాడు. ఈ సందర్భంగా ఏబీ, కోహ్లీ మధ్య పలు కీలక విషయాల గురించి మనసు విప్పి మాట్లాడారు. కోహ్లి తన వ్యక్తిగత, వృత్తి జీవితం గురించి పలు కీలక విషయాలు వెల్లడించాడు. టెస్టు క్రికెట్‌కు మరింత గౌరవం ఇస్తానని కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఐతే ఇప్పుడు టెస్టులో సెంచరీ చేసిన తర్వాత ఈ కరువు తీరింది. దీంతో పాటు విరాట్ తన వ్యక్తిగత జీవితం గురించి కూడా మాట్లాడాడు.

అనుష్క, విరాట్ తొలిసారి ఎలా కలిశారో తెలుసా?

2013లో జింబాబ్వే టూర్‌కు భారత జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించానని విరాట్ పోడ్‌కాస్ట్‌లో తెలిపాడు. ఆ తర్వాతే నాకు యాడ్స్ చేయడానికి ఆఫర్లు రావడం మొదలైంది. అనుష్కతో నా షూట్ జరగబోతోందని మా మేనేజర్ చెప్పారు. అనుష్క అంటే నాకు చాలా గౌరవం. ఆమెను కలవడానికి ముందు నేను చాలా భయపడ్డాను.

‘ఆమె నా ముందు కనిపించినప్పుడు, ఆమె ఎత్తులో నాతో సమానంగా ఉంది. నేను భయాందోళనకు గురయ్యాను. వెంటనే ఓ జోక్ పేల్చాలని అనుకున్నా.. ఎత్తు తక్కువగా ఉండే హీల్స్ ధరించాల్సింది అని అడిగాను. ఈ విషయంలో అనుష్క కూడా వెంటనే రియాక్ట్ అయింది. ఇప్పుడు వేసుకున్న షూస్ కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న షూస్ లేవా అంటూ ఆన్సర్ ఇచ్చిందంటూ’ విరాట్ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

‘అయితే ఆ రోజంతా షూటింగ్ చేశాక ఆమెతో కంఫర్టబుల్‌గా మారాను. అనుష్క కూడా అచ్చం నాలాగే అని అర్థమైంది. మేమిద్దరం మధ్యతరగతి ఇంట్లో పెరగడం వల్ల మా ఇద్దరి మధ్య చాలా విషయాలు సాధారణం అయ్యాయి. మా మధ్య స్నేహం పెరిగింది. ఆ తర్వాత మేం డేటింగ్ చేయడం ప్రారంభించాం’ అని విరాట్ తెలిపాడు.

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌పై మాట్లాడుతూ..

టీ20లు, వన్డేల్లో సెంచరీ చేసినా, టెస్టుల్లో సెంచరీ చేసిన తర్వాత ఇప్పుడు మెరుగ్గా ఉన్నాను. ఐపీఎల్‌లో చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు ఆస్ట్రేలియా ఆటగాళ్లు మునుపటిలా స్లెడ్డింగ్ చేయడం లేదు. ఇప్పుడు ఇరు జట్ల మధ్య సానుకూల సంభాషణ జరుగుతోంది. ఆస్ట్రేలియాలో గెలుపుపై ​​ఇప్పటికీ అదే వైఖరి, దూకుడు ఉంది. చివరి వరకు వదులుకోం. మేం 10 సంవత్సరాలుగా నాథన్ లియాన్‌తో ఆడుతున్నాం. అతడితో ఆడే అవకాశం రావడం మా అదృష్టం. ఇప్పుడు నేను ప్రతి గేమ్‌ను వృత్తిపరంగా తీసుకుంటాను. పూర్తి అంకితభావంతో ఆడటానికి ప్రయత్నిస్తున్నాను’ అని కింగ్ కోహ్లీ పేర్కొన్నాడు.

ర్యాపిడ్ ఫైర్..

రన్నింగ్‌లో ఎవరితో బెస్ట్ కోఆర్డినేషన్ ఉంటుంది – ఎంఎస్ ధోని

స్టేడియంలో అత్యుత్తమ వాతావరణం – 2016లో IPL ఫైనల్, 2011 ప్రపంచ కప్ ఫైనల్, పాకిస్తాన్‌తో MCGలో T20 ప్రపంచ కప్ 2022 సమయంలో బెస్ట్ అనిపించింది.

MCG బాక్సింగ్ డే లేదా లార్డ్స్ రెండింటిలో ఏది బెస్ట్- బాక్సింగ్ డే టెస్ట్ ఆడటానికి ఇష్టపడతానంటూ ఆన్సర్ ఇచ్చాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..