ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ICC ప్రపంచ కప్ 2023 ఫైనల్‌లో టీమ్ ఇండియాను ఓడించి విశ్వవిజేతగా ఆవిర్భవించింది ఆస్ట్రేలియా. రికార్డు స్థాయిలో 10వ ICC టైటిల్‌ను గెలుచుకుంది . ఆసీస్ తరుపున విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన ట్రావిస్ హెడ్ సెంచరీతో కోట్లాది మంది భారత అభిమానుల హృదయాలను ముక్కలు చేశాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీల నేపథ్యంలో 240 పరుగులు చేసింది. అయితే మొత్తం టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్‌కు చేరిన భారత్ ఫైనల్‌లో ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ ప్రపంచకప్ ముగియడంతో అవార్డు విజేతల జాబితా కూడా బయటకు వచ్చింది. ఈ ప్రపంచకప్‌లో అత్యధికంగా 765 పరుగులు చేసిన కోహ్లి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డును గెలుచుకోగా, ఫైనల్లో 137 పరుగులు చేసిన హెడ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఓపెనింగ్ మ్యాచ్‌లో కోహ్లి మ్యాచ్-బెస్ట్ హాఫ్ సెంచరీతో ప్రచారాన్ని ప్రారంభించాడు, 11 ఇన్నింగ్స్‌ల్లో 9 ఫిఫ్టీ ప్లస్ స్కోర్‌లను నమోదు చేశాడు. దీంతో, వన్డే ప్రపంచకప్ ఎడిషన్‌లో అత్యధిక వన్డే సెంచరీలు, అత్యధిక పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ ప్రధాన రికార్డులను కోహ్లీ బద్దలు కొట్టాడు.
ఈ ప్రపంచకప్‌లో భారత ఆటగాళ్లు వ్యక్తిగతంగా ఆధిపత్యం చెలాయించడం టీమిండియా అభిమానులకు కాస్త ఊరటనిచ్చే అంశం. స్కోరింగ్ చార్టులలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉండగా, బౌలింగ్ చార్టులలో మహ్మద్ షమీ ఆధిపత్యం చెలాయించాడు. మొత్తం టోర్నీలో 765 పరుగులు చేసిన కోహ్లి తర్వాత రెండో స్థానంలో రోహిత్ శర్మ ఉన్నాడు. మొత్తం టోర్నీలో భారత్ తరఫున అద్భుతంగా బౌలింగ్ చేసిన మహ్మద్ షమీ.. ఫైనల్ మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ వికెట్‌తో ఈ ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఈ ప్రపంచకప్‌లో షమీ కేవలం 7 ఇన్నింగ్స్‌ల్లోనే 24 వికెట్లతో బౌలింగ్ చార్టుల్లో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ ప్రపంచకప్‌లో ఏ ఆటగాడికి ఏ అవార్డు వచ్చిందో చూద్దాం రండి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..