Virat Kohli: వన్డే, టీ20 తర్వాత టెస్టు కెప్టెన్సీ నుంచి కూడా విరాట్ కోహ్లీ తప్పుకున్నాడు. అయితే టెస్టు కెప్టెన్సీ ఇంత త్వరగా వదులుకుంటాడని ఎవరూ ఊహించలేదు. దీంతో కోహ్లీ నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మీడియా కథనాల ప్రకారం విరాట్ కోహ్లీ బీసీసీఐతో మాట్లాడకుండానే టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడని తెలిసింది. కేప్ టౌన్ టెస్టు ముగిసిన 24 గంటల తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విరాట్ జట్టు ఆటగాళ్లకు మాత్రమే తన నిర్ణయం గురించి చెప్పాడు. గత మూడు నెలల్లో విరాట్ కోహ్లి మూడు ఫార్మాట్లకు సారథ్యం వహించిన తీరు చూస్తే అతడికి పెను ముప్పు పొంచి ఉన్నట్లు కనిపిస్తోంది.
నిజానికి కెప్టెన్సీ నుంచి వైదొలగే ముందు విరాట్ కోహ్లీ బీసీసీఐని సంప్రదించలేదని వార్తలు వినిపిస్తున్నాయి. విరాట్ కోహ్లి, బోర్డు మధ్య వాగ్వాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. కోహ్లి ఇప్పుడు కెప్టెన్ కాదు గత రెండు సంవత్సరాలుగా అతను అంతర్జాతీయ క్రికెట్‌లో చాలా పేలవమైన ప్రదర్శనతో ఉన్నాడు. ముఖ్యంగా టెస్టు క్రికెట్‌లో పుజారా, రహానెల తరహాలో పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. విరాట్ కోహ్లీ గణాంకాలు అతనికి సమస్యగా మారవచ్చు. టెస్టు క్రికెట్‌లో 50కి పైగా సగటు ఉన్న విరాట్ కోహ్లీ గత రెండేళ్లుగా పేలవ ఫామ్‌లో ఉన్నాడు. విరాట్ కోహ్లీ 15 టెస్టుల్లో కేవలం 6 అర్ధ సెంచరీలు మాత్రమే చేశాడు. విరాట్ 27 ఇన్నింగ్స్‌ల్లో 28.14 సగటుతో 760 పరుగులు మాత్రమే చేశాడు.
ఇప్పుడు అజింక్య రహానే, ఛెతేశ్వర్ పుజారా ప్రదర్శనను చూడండి. గత రెండేళ్లలో రహానే 19 టెస్టుల్లో 24.08 సగటుతో 819 పరుగులు చేశాడు. గత రెండేళ్లలో 20 టెస్టులాడిన ఛెతేశ్వర్ పుజార్ 26.29 సగటుతో 973 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లి, అజింక్యా రహానే, ఛెతేశ్వర్ పుజారా ప్రదర్శనలో పెద్దగా తేడా లేదు. ఇప్పుడు పుజారా, రహానెల ఆటతీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అదే సమయంలో విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుత టీమ్ మేనేజ్‌మెంట్‌కు కూడా ఏం చెప్పడం లేదు.
ఇప్పటికే విరాట్ కోహ్లి, బీసీసీఐ మధ్య గొడవ సద్దుమణగలేదు. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు BCCI విరాట్ కోహ్లీ నుంచి ODI కెప్టెన్సీని తొలగించింది ఆ తర్వాత అతను BCCI, సౌరవ్ గంగూలీపై ప్రశ్నలు లేవనెత్తాడు. దక్షిణాఫ్రికా టూర్‌కు ముందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విరాట్ కోహ్లీ.. గంగూలీ అభిప్రాయాన్ని తప్పుగా పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీ పరిస్థితి ఇప్పుడు మారిందని అతను కెప్టెన్‌గా సిద్దంగా లేడని స్పష్టం చేసింది. ఇప్పుడు అతడు పరుగులు చేయకపోతే జట్టులో అతడి స్థానం ఇతర ఆటగాళ్లతో సమానంగా ఉంటుంది.