RCB vs SRH: ఈ సీజన్‌లోనే బిగ్ ఫైట్.. కోహ్లీ వర్సెస్ హెడ్! మ్యాచ్ తర్వాత చూడండి ఏం జరిగిందో!
విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్ మధ్య ఐపీఎల్ 2026లో జరిగిన ఆర్‌సిబి-ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్‌లో వాగ్వాదం చోటుచేసుకుంది. మ్యాచ్ అనంతరం కరచాలన సమయంలో కూడా ఇద్దరి మధ్య ఉద్రిక్తత కనిపించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి..

ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ సందర్భంగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఎస్‌ఆర్‌హెచ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ మధ్య మైదానంలో వాగ్వాదం జరగడం చర్చనీయాంశమైంది. ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 55 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో 256 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి మంచి స్టార్ట్ లభించినా ఆ వెంటనే వరుసగా వికెట్లు కోల్పోయింది. కోహ్లీ కేవలం 11 బంతుల్లో 15 పరుగులు చేసి సైక్ హుస్సేన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అయితే మ్యాచ్ సమయంలో వెంకటేష్ అయ్యర్ బ్యాటింగ్ చేస్తున్న వేళ కోహ్లీ, ట్రావిస్ హెడ్ మధ్య మాటల యుద్ధం కెమెరాల్లో రికార్డ్ అయింది. కోహ్లీ, హెడ్ వైపు చూస్తూ బౌలింగ్ చేయి అన్నట్లు సంకేతాలు ఇవ్వడం, ఇంపాక్ట్ ప్లేయర్ సూచనలు చేయడం కనిపించింది.
దీనికి హెడ్ కూడా స్పందించడంతో కొద్దిసేపు ఇద్దరి మధ్య ఉద్రిక్తత నెలకొంది. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా ఈ ఉద్రిక్తత కొనసాగినట్లు కనిపించింది. మ్యాచ్ అనంతరం ఇరుజట్ల ఆటగాళ్లు షేక్‌హ్యాండ్స్ ఇచ్చుకునే సమయంలో కోహ్లీ ఇతర ఆటగాళ్లతో చేతులు కలిపినా, ట్రావిస్ హెడ్‌ను పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయాడు.
Look at the way Travis Head went to shake hands with Virat Kohli, but Kohli did not shake hands with him back. Seriously, what happened between them? 👀
I have always seen both of them sharing a good bond during international cricket and even in the IPL. pic.twitter.com/lTrCYyIL20
— Sonu (@Cricket_live247) May 23, 2026
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లు ఆర్‌సిబి బౌలర్లపై విరుచుకుపడి భారీ స్కోరు నమోదు చేశారు. అనంతరం బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఆర్‌సిబిని 200/4కే పరిమితం చేశారు. అయితే ఈ మ్యాచ్‌లో ఓటమి చెందినప్పటికీ ఆర్‌సిబి పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవడంలో విజయవంతమైంది. ఈ నెల 26న గుజరాత్ టైటాన్స్‌తో ఆర్సీబీ తొలి క్వాలిఫైయర్ ఆడనుంది.
🚨 HEATED ARGUMENT BETWEEN VIRAT KOHLI & TRAVIS HEAD 🚨
Virat Kohli Said 🗣️, “Come on, come bowl, and then I’ll show you sixes.”
Travis Head Said🗣️, “If I come to bowl, you’ll run back to the dressing room.” (Laugh) pic.twitter.com/RjPg7RdKRa
— lndian Sports Netwrk (@IS_Netwrk29) May 22, 2026
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
