Virat Kohli : రికార్డుల రారాజుకు ఎదురైన వింత అనుభవం..ఆ పిల్లాడిని చూసి కోహ్లీ నవ్వు ఆపుకోలేకపోయాడు

Virat Kohli : న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ముందు వడోదరలో యాడ్ షూటింగ్‌లో పాల్గొన్న విరాట్ కోహ్లీ, ఆ తర్వాత తన నలుగురు చిన్నారులను కలిసి ఆటోగ్రాఫ్స్ ఇచ్చారు. అయితే ఆ గుంపులో ఒక బాబును చూడగానే విరాట్ ముఖంలో ఒక వింతైన చిరునవ్వు కనిపించింది.

Virat Kohli : రికార్డుల రారాజుకు ఎదురైన వింత అనుభవం..ఆ పిల్లాడిని చూసి కోహ్లీ నవ్వు ఆపుకోలేకపోయాడు
Virat Kohli Century

Updated on: Jan 09, 2026 | 2:42 PM

Virat Kohli : టీమిండియా రన్ మెషీన్, కింగ్ కోహ్లీ ప్రస్తుతం వడోదరలో న్యూజిలాండ్‌తో జరగబోయే తొలి వన్డే కోసం తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే ప్రాక్టీస్ సెషన్ మధ్యలో ఒక ఆసక్తికరమైన ఘటన జరిగింది. కోహ్లీని కలిసేందుకు వచ్చిన ఒక చిన్నారి అభిమానిని చూసి సాక్షాత్తు కింగ్ కోహ్లీయే ఒక్కక్షణం షాక్ అయ్యారు. ఆ పిల్లాడి ముఖం అచ్చం విరాట్ కోహ్లీ చిన్నప్పటి పోలికలతో ఉండటమే దీనికి కారణం. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ముందు వడోదరలో యాడ్ షూటింగ్‌లో పాల్గొన్న విరాట్ కోహ్లీ, ఆ తర్వాత తన నలుగురు చిన్నారులను కలిసి ఆటోగ్రాఫ్స్ ఇచ్చారు. అయితే ఆ గుంపులో ఒక బాబును చూడగానే విరాట్ ముఖంలో ఒక వింతైన చిరునవ్వు కనిపించింది. ఆ పిల్లాడి కళ్లు, ముఖ కవళికలు చూస్తుంటే విరాట్ కోహ్లీ చిన్నప్పటి ఫోటో చూస్తున్నట్టే ఉంది. అచ్చుగుద్దినట్లు తనలాగే ఉన్న ఆ బాబుకు కోహ్లీ ఎంతో ప్రేమగా ఆటోగ్రాఫ్ ఇచ్చారు. ఈ ఫోటో నెట్టింట వైరల్ కావడంతో “కింగ్ కోహ్లీ జూనియర్ దొరికేశాడు” అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

ఆదివారం న్యూజిలాండ్‌తో జరగబోయే తొలి వన్డే సందర్భంగా విరాట్ కోహ్లీకి ఒక అరుదైన గౌరవం దక్కనుంది. కోటాంబి స్టేడియంలో జరిగే ప్రారంభ వేడుకల్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో కలిసి జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టానికి బీసీసీఐ పెద్దలతో పాటు ఐసీసీ చీఫ్ జై షా కూడా హాజరవుతున్నారు. ఈ వేడుకను చూసేందుకు వడోదర అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది.

న్యూజిలాండ్ వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీపై రికార్డుల వర్షం కురిసే అవకాశం ఉంది. కేవలం 10 పరుగులు చేస్తే చాలు.. న్యూజిలాండ్‌పై భారత్ తరపున గెలిచిన మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టిస్తాడు. మరో 25 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 28,000 పరుగులు పూర్తి చేసిన ఘనత కోహ్లీ సొంతం అవుతుంది. ఇక ఈ సిరీస్‌లో 94 పరుగులు చేస్తే న్యూజిలాండ్‌పై అత్యధిక వన్డే పరుగులు చేసిన ఇండియన్‌గా నిలుస్తాడు. అలాగే ఒక సెంచరీ బాదితే కివీస్‌పై అత్యధిక ఇంటర్నేషనల్ సెంచరీలు చేసిన ప్లేయర్ అవుతాడు.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..