
Virat Kohli : టీమిండియా స్టార్ బ్యాటర్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. చాలా కాలం తర్వాత దేశవాళీ క్రికెట్ బరిలోకి దిగి విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీ తరపున పరుగుల వరద పారించాడు. అయితే, అభిమానులకు షాక్ ఇస్తూ విరాట్ అకస్మాత్తుగా ఢిల్లీ జట్టును వీడి ఇంటికి బయలుదేరాడు. బెంగళూరు ఎయిర్‌పోర్ట్ నుంచి ఆయన నేరుగా ముంబైకి పయనమైనట్లు సమాచారం. అయితే కంగారు పడాల్సిన పనిలేదు, విరాట్ కేవలం తన కుటుంబంతో కలిసి కొత్త ఏడాది వేడుకలు జరుపుకోవడానికి ఈ చిన్న విరామం తీసుకున్నాడు.
విరాట్ కోహ్లీ విజయ్ హజారే ట్రోఫీలో కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడి ఏకంగా 208 పరుగులు సాధించాడు. అంటే అతని సగటు 104గా ఉంది. ఆంధ్రాపై 131 పరుగులతో సెంచరీ బాదిన కోహ్లీ, గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. అయినప్పటికీ అద్భుత ఇన్నింగ్స్ ఆడి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. ఇప్పుడు వరుసగా మూడు మ్యాచ్‌లకు విరాట్ దూరం కానున్నాడు. న్యూ ఇయర్ సెలవుల తర్వాత విరాట్ మళ్ళీ జట్టుతో చేరుతాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
Virat Kohli Spotted At Bengaluru Airport.🖤 pic.twitter.com/4umCpiL5OQ
— Virat.kohli.insider (@_kohlisensation) December 26, 2025
వార్తల ప్రకారం.. జనవరి 6న రైల్వేస్‌తో జరిగే మ్యాచ్ కోసం విరాట్ మళ్ళీ ఢిల్లీ జట్టుతో కలిసే అవకాశం ఉంది. న్యూజిలాండ్‌తో జరగబోయే వన్డే సిరీస్‌కు ముందు కోహ్లీకి ఇదే ఆఖరి డొమెస్టిక్ మ్యాచ్ కానుంది. ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే ఆయన టీమిండియాతో కలుస్తాడు. భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే జనవరి 11న వడోదరలో ప్రారంభం కానుంది. కివీస్ బౌలర్లను ఎదుర్కోవడానికి కోహ్లీ ఇప్పటికే పక్కా ప్రణాళికతో సిద్ధమయ్యాడని అతని ప్రస్తుత ఫామ్ చూస్తుంటే అర్థమవుతోంది.
విరాట్ కోహ్లీ వన్డే ఫార్మాట్‌లో ప్రస్తుతం భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. గత 6 వన్డే ఇన్నింగ్స్‌లలో ఆయన 6 సార్లు 50 కంటే ఎక్కువ పరుగులు సాధించాడు, ఇందులో మూడు సెంచరీలు కూడా ఉన్నాయి. విరాట్ ఫామ్‌లో ఉండటం భారత జట్టుకు పెద్ద సానుకూలాంశం. తన ఫ్యామిలీతో సరదాగా గడిపి, రీఛార్జ్ అయ్యి వచ్చి మళ్ళీ గ్రౌండ్‌లో పరుగుల వేట మొదలుపెడతాడని అభిమానులు ఆశిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..