Video: అక్కడున్నది కింగ్‌ రా.! గంభీర్‌కు గట్టిగా ఇచ్చిపడేసిన కోహ్లి.. మీరూ చూసేయండి

Kohli vs Gambhir: ఆదివారం సాయంత్రం రాంచీలో అభిమానులు ఒక ప్రత్యేక సంఘటనను చూశారు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు తరపున 52వ వన్డే సెంచరీ సాధించి విరాట్ కోహ్లీ తన పాత ఫాంకి తిరిగి వచ్చాడు. కోహ్లీ ఇప్పుడు తన కెరీర్‌లో అద్భుతమైన దశలో ఉన్నాడు. 2027లో వన్డే ప్రపంచ కప్ ఆడతాడా లేదా అనేది అతని ఫామ్, ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుంది.

Video: అక్కడున్నది కింగ్‌ రా.! గంభీర్‌కు గట్టిగా ఇచ్చిపడేసిన కోహ్లి.. మీరూ చూసేయండి
Kohli Vs Gambhir

Updated on: Dec 02, 2025 | 9:14 AM

Kohli vs Gambhir: భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ తన 52వ వన్డే సెంచరీని సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, మ్యాచ్ తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో చోటుచేసుకున్న ఒక ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వైరల్ వీడియోలో ఏముంది?

మ్యాచ్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్తుండగా తీసిన వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో, కోహ్లీ తన ఫోన్ చూసుకుంటూ, పక్కనే ఉన్న హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ను పట్టించుకోకుండా వెళ్లిపోతున్నట్లు కనిపిస్తోంది. గంభీర్ అక్కడే నిలబడి ఉన్నప్పటికీ, కోహ్లీ ఆయనను చూడకుండానే వెళ్లడంతో ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: IND vs SA 2nd ODI: రాంచీలో చెత్త ఆట.. కట్‌చేస్తే.. 2వ వన్డే నుంచి ముగ్గురు ఔట్.. గంభీర్ కీలక నిర్ణయం..?

అసలు నిజం ఏమిటి? (Fact Check)..

ఈ వైరల్ వీడియో పూర్తిగా నిజం కాదు. ఇది కేవలం ఒక చిన్న క్లిప్ మాత్రమే. వాస్తవానికి, కోహ్లీ డ్రెస్సింగ్ రూమ్‌కి చేరుకున్న వెంటనే గౌతమ్ గంభీర్ లేచి నిలబడి కోహ్లీని అభినందించారు. ఇద్దరూ చిరునవ్వుతో షేక్ హ్యాండ్ ఇచ్చుకుని, ఆలింగనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వీడియోలు, ఫొటోలు కూడా బయటకు వచ్చాయి.

సోషల్ మీడియాలో ప్రచారమవుతున్నట్లుగా కోహ్లీ, గంభీర్ మధ్య ఎటువంటి విభేదాలు లేవు. కోహ్లీ అద్భుత సెంచరీ తర్వాత గంభీర్ అతన్ని మనస్ఫూర్తిగా అభినందించారు. వైరల్ అవుతున్న వీడియో సందర్భోచితం కాదని, అభిమానులు తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని స్పష్టమవుతోంది.

ఇది కూడా చదవండి: IND vs SA: ప్రపంచ రికార్డులను పేకాటాడేసిన రోహిత్, కోహ్లి.. తొలి వన్డేలో బద్దలైన 10 రికార్డులు..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..