Virat Kohli : సాధారణ గాయం కాదు.. స్కానింగ్ రిపోర్టులో అసలు నిజం.. మళ్లీ కోహ్లీ బ్యాట్ పట్టాలంటే ఎన్ని రోజులు పడుతుందో ?

Virat Kohli : ఐపీఎల్ 2026 ఫైనల్లో గాయపడిన విరాట్ కోహ్లీకి డిస్టల్ సెమీమెంబ్రానోసస్ టెండన్ టియర్ అనే అరుదైన గాయమైంది. దీనివల్ల అతను ఆఫ్ఘన్ వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. కోహ్లీ తిరిగి క్రికెట్ ఆడటానికి ఎంత సమయం పడుతుందనేది అతని గాయం తీవ్రతపై ఆధారపడి ఉంటుంది.

Virat Kohli : సాధారణ గాయం కాదు.. స్కానింగ్ రిపోర్టులో అసలు నిజం.. మళ్లీ కోహ్లీ బ్యాట్ పట్టాలంటే ఎన్ని రోజులు పడుతుందో ?
Virat Kohli

Updated on: Jun 05, 2026 | 7:07 PM

Virat Kohli : బీసీసీఐ అభిమానులకు ఊహించని పెద్ద షాక్ తగిలింది. జూన్ 13 నుంచి ఆఫ్ఘనిస్తాన్‌తో జరగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ నుంచి స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పూర్తిగా దూరమయ్యాడు. ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టును ఒంటిచేత్తో గెలిపించి రెండో టైటిల్ అందించిన కోహ్లీ.. అదే మ్యాచ్‌లో తీవ్రంగా గాయపడ్డాడు. మొదట్లో ఇది సాధారణమైన హ్యామ్‌స్ట్రింగ్ గాయం అని అందరూ భావించినప్పటికీ, తాజా స్కానింగ్ రిపోర్టులలో అత్యంత తీవ్రమైన సమస్య ఉన్నట్లు వెల్లడైంది.

అథ్లెట్లలో ఈ గాయం చాలా అరుదు.. ఎందుకంటే?

సాధారణంగా క్రీడాకారులకు హ్యామ్‌స్ట్రింగ్ గాయాలు తొడ పైభాగంలో లేదా మధ్య భాగంలో అవుతుంటాయి. కానీ మోకాలి వెనుక భాగంలో ఉండే ఈ సెమీమెంబ్రానోసస్ టెండన్ చాలా బలంగా, మందంగా ఉండి ఎముకకు గట్టిగా అతుక్కుని ఉంటుంది. అందువల్ల ఇది అంత సులభంగా తెగదు. అయితే ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో 155 పరుగుల చిన్న లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోహ్లీ మధ్యలోనే గాయపడినా, జట్టును గెలిపించాలనే పట్టుదలతో ఫిజియోల మాట వినకుండా విపరీతమైన నొప్పితోనే కుంటుకుంటూ బ్యాటింగ్ కొనసాగించాడు. శరీరాన్ని అంతగా కష్టపెట్టడం వల్లే ఈ అరుదైన మైక్రో-టియర్ కాస్తా పెద్ద గాయంగా మారింది.

కోహ్లీ మళ్లీ మైదానంలోకి రావడానికి ఎంత టైమ్ పడుతుంది?

కోహ్లీ తిరిగి క్రికెట్ ఆడటానికి ఎంత సమయం పడుతుందనేది అతని గాయం తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నివేదికల ప్రకారం రికవరీ సమయాన్ని రెండు రకాలుగా విభజించవచ్చు:

సర్జరీ అవసరం లేకపోతే : ఒకవేళ కోహ్లీకి అయింది చిన్నపాటి మైక్రో టియర్ లేదా పాక్షికంగా మాత్రమే కండరం తెగి ఉంటే.. విశ్రాంతి, ఫిజియోథెరపీ ద్వారా నయం చేయవచ్చు. దీనికి కనీసం 1.5 నెలల నుంచి 3 నెలల సమయం పడుతుంది.

సర్జరీ చేయాల్సి వస్తే : ఒకవేళ టెండన్ ఎముక నుంచి పూర్తిగా విడిపోయి ఉంటే దాన్ని అతుకబెట్టడానికి ఖచ్చితంగా సర్జరీ చేయాలి. సర్జరీ గనుక జరిగితే కోహ్లీ పూర్తిగా కోలుకుని మళ్లీ ఫుల్ ఫిట్‌నెస్ సాధించడానికి కనీసం 4 నుంచి 6 నెలల సుదీర్ఘ సమయం పడుతుంది. అదే జరిగితే రాబోయే కొన్ని ముఖ్యమైన సిరీస్‌లకు కూడా కోహ్లీ దూరం కావలసి వస్తుంది.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us