Virat Kohli: బెయిల్స్‌తో మ్యాజిక్ చేసిన విరాట్ కోహ్లీ.. కట్‌చేస్తే.. ఆ వెంటనే వికెట్ పడగొట్టిన బుమ్రా..

|

Dec 27, 2023 | 9:55 PM

ఇందులో కోహ్లి స్టంప్స్‌పై బెయిల్స్‌ని ఉంచుతున్నట్లు కనిపించాడు. రెండో చిత్రంలో కోహ్లిని చూస్తుంటే.. బెల్స్‌తో ఏదో మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. కోహ్లీ బెయిల్స్ పెట్టిన కొద్దిసేపటికే భారత్‌కు వికెట్ దక్కింది. జస్ప్రీత్ బుమ్రా టోనీ డి జార్జి, కీగన్ పీటర్సన్‌లకు పెవిలియన్ దారి చూపించాడు. దీనికి సంబంధించి పలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి.

Virat Kohli: బెయిల్స్‌తో మ్యాజిక్ చేసిన విరాట్ కోహ్లీ.. కట్‌చేస్తే.. ఆ వెంటనే వికెట్ పడగొట్టిన బుమ్రా..
Virat Kohli Viral Video
Follow us on

Virat Kohli IND vs SA: సెంచూరియన్‌లో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. విరాట్ కోహ్లి బెయిల్‌తో స్టంప్స్‌ వద్దకు చేరుకుని, ఏదో చేశాడు. ఆ వెంటనే జస్ప్రీత్ బుమ్రా వికెట్ తీశాడు. దీంతో సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఫొటోలు తెగ వైరలవుతున్నాయి. దీనికి సంబంధించి చాలా వీడియోలు కూడా షేర్ అయ్యాయి. టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 245 పరుగులకు ఆలౌటైంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్స్ ఆడుతోంది. రెండోరోజు ఆటముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 5 వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసింది. దీంతో సౌతాఫ్రికా తొల ఇన్నింగ్స్‌లో 11 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. డీన్ ఎల్గర్ 107 పరుగులతో ఆడుతున్నాడు.

Actually Rajasthan Royals Xలో ఓ పోస్ట్‌‌ను భాగస్వామ్యం చేశారు. ఇందులో కోహ్లి స్టంప్స్‌పై బెయిల్స్‌ని ఉంచుతున్నట్లు కనిపించాడు. రెండో చిత్రంలో కోహ్లిని చూస్తుంటే.. బెల్స్‌తో ఏదో మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. కోహ్లీ బెయిల్స్ పెట్టిన కొద్దిసేపటికే భారత్‌కు వికెట్ దక్కింది. జస్ప్రీత్ బుమ్రా టోనీ డి జార్జి, కీగన్ పీటర్సన్‌లకు పెవిలియన్ దారి చూపించాడు. దీనికి సంబంధించి పలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి.

కోహ్లీ కంటే ముందు హార్దిక్ పాండ్యాకు సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది. ప్రపంచ కప్ 2023 మ్యాచ్‌లో పాండ్యా బంతితో ఏదో మాట్లాడుతూ కనిపించాడు. ఫన్నీగా మ్యాజిక్ చేయడం గురించి అభిమానులు సోషల్ మీడియాలో చాలా పోస్ట్‌లను పంచుకున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..