
Viral Video : భారతదేశంలో క్రికెట్ అంటే కేవలం ఆట కాదు, ఒక ఎమోషన్. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీల బంధం గురించి ఫ్యాన్స్‌కు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ ప్రారంభానికి మూడు రోజుల ముందు రాంచీలో ఆసక్తికరమైన దృశ్యం కనిపించింది. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోని ఇంటికి వెళ్లి ఆయన్ని కలిశాడు. వీరిద్దరితో పాటు రిషబ్ పంత్, రుతురాజ్ గైక్వాడ్ వంటి ఆటగాళ్లు కూడా ధోని ఇంటికి వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రాంచీలో ధోని ఇంటికి కోహ్లీ, పంత్
సౌతాఫ్రికాతో జరగబోయే మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత జట్టు రాంచీలోని జేఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్లో ఆడనుంది. సిరీస్ ప్రారంభానికి మూడు రోజుల ముందు, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఫామ్‌హౌస్‌కు వెళ్లి ఆయన్ని కలిశాడు. కోహ్లీతో పాటు యువ ఆటగాళ్లు రిషబ్ పంత్, రుతురాజ్ గైక్వాడ్ కూడా ధోని ఇంటికి వెళ్లి కాసేపు గడిపారు. ధోని తన కారు డ్రైవ్ చేస్తుండగా, పక్క సీట్లో కోహ్లీ కూర్చుని ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అలాగే కోహ్లీ ధోని ఇంట్లోకి వెళ్తున్న క్లిప్, పంత్ ధోని నివాసంలో ఉన్న వీడియోలు కూడా ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి.
Virat Kohli at MS Dhoni house pic.twitter.com/2yopBzGjRO
— Yash MSdian ™️ 🦁 (@itzyash07) November 27, 2025
Rishabh Pant at MS Dhoni house pic.twitter.com/L9Qh33rvMA
— Yash MSdian ™️ 🦁 (@itzyash07) November 27, 2025
నెట్స్‌లో రోహిత్, విరాట్ ప్రాక్టీస్
కోహ్లీ ధోని ఇంటికి వెళ్లడానికి ముందు రోజు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ నెట్స్‌లో తమ ప్రాక్టీస్‌ను మెరుగుపరుచుకోవడం కనిపించింది. వీరితో పాటు యువ ఆటగాళ్లు తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్ కూడా ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నారు. వన్డే సిరీస్‌తో రోహిత్, విరాట్ అంతర్జాతీయ క్రికెట్‌కు తిరిగి రానున్నారు. వీరు చివరిసారిగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో ఆడారు. ఆ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లలో భారత్ ఓడిపోయినప్పటికీ, చివరి వన్డేలో రోహిత్, కోహ్లీల భాగస్వామ్యం కారణంగానే భారత్ ఓదార్పు విజయాన్ని సాధించింది.
MS Dhoni and Virat Kohli together pic.twitter.com/MjOxDCSQHe
— Yash MSdian ™️ 🦁 (@itzyash07) November 27, 2025
రాహుల్ కెప్టెన్సీలో టీమిండియా ఒత్తిడి
టెస్ట్ సిరీస్‌లో ఓడిపోయిన తర్వాత, భారత జట్టుపై కొంత ఒత్తిడి ఉంది. అయితే వన్డే సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లు రోహిత్, విరాట్ తిరిగి రావడం జట్టుకు ఉత్సాహాన్ని ఇస్తుందని భావిస్తున్నారు. ఈ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఈ ఇద్దరు దిగ్గజాలు కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో ఆడనున్నారు. టెస్ట్ క్రికెట్ నుంచి ధోని లాగే, రోహిత్, కోహ్లీలు కూడా టెస్ట్ ఫార్మాట్ నుంచి రిటైర్ అయిన తర్వాత ఆడుతున్న వన్డే సిరీస్ ఇది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..