Vijay Hazare Trophy 2021 : క్రికెట్ అభిమానులకు పండగే పండగ.. నేటి నుంచి విజయ్‌ హజారే ట్రోఫీ.. ఆరు జట్ల మధ్య హోరాహోరి పోరు..

|

Feb 20, 2021 | 11:00 AM

Vijay Hazare Trophy: భారత దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీకి రంగం సిద్ధమైంది. దేశంలోని వేర్వేరు వేదికల్లో నేటినుంచి ఈ టోర్నమెంట్‌

Vijay Hazare Trophy 2021 : క్రికెట్ అభిమానులకు పండగే పండగ.. నేటి నుంచి విజయ్‌ హజారే ట్రోఫీ.. ఆరు జట్ల మధ్య హోరాహోరి పోరు..
Follow us on

Vijay Hazare Trophy: భారత దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీకి రంగం సిద్ధమైంది. దేశంలోని వేర్వేరు వేదికల్లో నేటినుంచి ఈ టోర్నమెంట్‌ జరుగుతుంది. మొత్తం జట్లను ఆరు గ్రూప్‌లుగా విభజించి టోర్నీని నిర్వహిస్తున్నారు. 2020–21 సీజన్‌లో రంజీ ట్రోఫీని రద్దు చేసిన బీసీసీఐ టి20 టోర్నీ ముస్తాక్‌ అలీ ట్రోఫీని ఇప్పటికే నిర్వహించింది. ఇప్పుడు విజయ్‌ హజారే టోర్నీలో తమ సత్తా చాటి భారత వన్డే జట్టులో చోటు కోసం సెలక్టర్లను ఆకర్షించాలని యువ ఆటగాళ్లు భావిస్తున్నారు.

ఇప్పటికే టీమిండియా వన్డే జట్టులో రెగ్యులర్‌ సభ్యుడైన శ్రేయస్‌ అయ్యర్‌ ముంబై కెప్టెన్‌గా బరిలోకి దిగుతుండగా… గాయాలనుంచి కోలుకొని శిఖర్‌ ధావన్‌ (ఢిల్లీ), భువనేశ్వర్‌ కుమార్‌ (యూపీ) పునరాగమనం చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. పృథ్వీ షా కూడా తన ఫామ్‌ను అందుకునేందుకు ఈ టోర్నీ తగిన అవకాశం కల్పిస్తోంది. దినేశ్‌ కార్తీక్‌ తమిళనాడు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా…ఆస్ట్రేలియా పర్యటనలో ఆకట్టుకున్న నటరాజన్‌పై ఇప్పుడు అందరి దృష్టీ నిలిచింది. మార్చి 14న టోర్నీ ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుంది.

మీరు బీపీతో బాధపడుతున్నారా..? అదుపులో లేకపోతే హార్ట్‌ఎటాకే.. ఈ జాగ్రత్తలు పాటించండి తర్వాత మీకే తెలుస్తోంది..