Vaibhav Abhishek : వైభవ్, అభిషేక్ జోడీ.. ఈ కాంబో కనుక సెట్ అయితే టీ20 రికార్డులు గల్లంతే..అలా ఎప్పుడు అవుతుందంటే ?

రైజింగ్ స్టార్ ఆసియా కప్‌లో యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ కేవలం 32 బంతుల్లోనే సెంచరీ కొట్టి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి సోషల్ మీడియాలో అభిషేక్ శర్మతో కలిసి వైభవ్ కనుక టీ20 లో ఓపెనింగ్ చేస్తే ఎలా ఉంటుంది? అని ఒక ప్రశ్న బాగా చక్కర్లు కొడుతోంది.

Vaibhav Abhishek : వైభవ్, అభిషేక్ జోడీ.. ఈ కాంబో కనుక సెట్ అయితే టీ20 రికార్డులు గల్లంతే..అలా ఎప్పుడు అవుతుందంటే ?
Vaibhav Suryavanshi And Abhishek Sharma

Updated on: Nov 18, 2025 | 4:05 PM

Vaibhav Abhishek : రైజింగ్ స్టార్ ఆసియా కప్‌లో యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ కేవలం 32 బంతుల్లోనే సెంచరీ కొట్టి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి సోషల్ మీడియాలో అభిషేక్ శర్మతో కలిసి వైభవ్ కనుక టీ20 లో ఓపెనింగ్ చేస్తే ఎలా ఉంటుంది? అని ఒక ప్రశ్న బాగా చక్కర్లు కొడుతోంది. అయితే ఈ ఆసక్తికరమైన జోడీని చూడాలంటే, ముందుగా వైభవ్ సూర్యవంశీ టీమ్ ఇండియాలోకి ఎంట్రీ ఇవ్వాలి. మరి వైభవ్‌కు టీమిండియాలో చోటు ఎలా దొరుకుతుంది? దీనిపై వైభవ్ కోచ్ మనీష్ ఓఝా ఏం చెప్పారో వివరాలు తెలుసుకుందాం.

వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం ఇండియా ఎ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇండియా ఎ అనేది మన దేశంలోనే రెండో సీనియర్ జట్టు. కోచ్ మనీష్ ఓఝా మాట్లాడుతూ.. వైభవ్ ప్రస్తుతం ఆడుతున్న రైజింగ్ స్టార్ ఆసియా కప్ టోర్నమెంట్‌లో అతని ప్రదర్శన చాలా కీలకం అని చెప్పారు. టీమ్ ఇండియాలో చోటు దక్కించుకోవాలంటే ఈ టోర్నమెంట్‌లో వైభవ్ బాగా రాణించడం చాలా ముఖ్యమని ఆయన అన్నారు.

కేవలం 14 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ రైజింగ్ స్టార్ ఆసియా కప్‌లో అద్భుతంగా ఆడాడు. యూఏఈపై జరిగిన మొదటి మ్యాచ్‌లో వైభవ్ కేవలం 42 బంతుల్లోనే 144 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా 15 సిక్సర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో అనేక రికార్డులు బద్దలు కొట్టి, టీమ్‌ను గెలిపించిన హీరోగా వైభవ్ నిలిచాడు. పాకిస్తాన్‌పై జరిగిన రెండో మ్యాచ్‌లో కూడా 161 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 45 పరుగులు చేసి, టీమ్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

కోచ్ మనీష్ ఓఝా చెప్పినదాని ప్రకారం.. వైభవ్ సూర్యవంశీ కేవలం రైజింగ్ స్టార్ ఆసియా కప్‌లో బాగా ఆడితే సరిపోదు. టీమిండియాలో స్థానం సంపాదించాలంటే అతను ముందున్న ఈ మూడు ముఖ్యమైన అవకాశాలను కచ్చితంగా వాడుకోవాలి.

* రైజింగ్ స్టార్ ఆసియా కప్‌లో నిలకడగా రాణించడం.

* అండర్ 19 వరల్డ్ కప్‌లో అద్భుతంగా పర్ఫామ్ చేయడం.

* ఐపీఎల్ తదుపరి సీజన్‌లో తన సత్తా చూపడం.

ఈ మూడు టోర్నమెంట్‌లలో వైభవ్ సూర్యవంశీ నిలకడగా మెరుగైన ప్రదర్శన ఇవ్వగలిగితే, అప్పుడు టీమిండియాలోకి అతని ఎంట్రీ ఖాయం అవుతుంది. ఆ తర్వాతే అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం దక్కుతుంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..