
Vaibhav Sooryavanshi IPL Salary: బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లా తాజ్‌పూర్‌కు చెందిన వైభవ్ సూర్యవంశీ కేవలం 13 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ వేలంలోకి వచ్చి సరికొత్త చరిత్ర లిఖించాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో రూ. 30 లక్షల బేస్ ప్రైస్‌తో బరిలోకి దిగిన వైభవ్ కోసం రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య గట్టి పోటీ నడిచింది. చివరకు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ ఏకంగా రూ. 1.10 కోట్లు వెచ్చించి ఈ యువ ప్రతిభను సొంతం చేసుకుంది. ఐపీఎల్ 2026 సీజన్ కోసం కూడా అదే భారీ ధరకు రాజస్థాన్ అతడిని జట్టులోనే ఉంచుకుంది. ప్రస్తుత సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ రేసులో దూసుకుపోతున్న ఈ సంచలన ఆటగాడి ఐపీఎల్ కాంట్రాక్ట్ విలువే అతడి ప్రధాన ఆదాయ వనరుగా మారింది.
ఇది కూడా చదవండి: కావ్య మారన్, అనిరుధ్ పెళ్లి..? వీరిద్దరి ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే అవాక్కే..
క్రీడా విశ్లేషకులు, విశ్వసనీయ సమాచారం ప్రకారం, మే 2026 నాటికి వైభవ్ సూర్యవంశీ మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ. 3 కోట్ల వరకు ఉంటుందని అంచనా. కేవలం ఐపీఎల్ మ్యాచ్ ఫీజులు, కాంట్రాక్ట్ ద్వారానే కాకుండా, పలు ఇతర మార్గాల ద్వారా కూడా ఈ వండర్‌కిడ్‌కు భారీగా ఆదాయం సమకూరుతోంది.
ఐపీఎల్ కాంట్రాక్ట్ (రాజస్థాన్ రాయల్స్): రూ. 1.10 కోట్లు (స్థిర ఆదాయం)
ఐపీఎల్ మ్యాచ్ ఫీజులు: ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల ద్వారా సుమారు రూ. 52.5 లక్షల వరకు లభించింది.
ప్రభుత్వ పురస్కారాలు: అండర్-19 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేసినందుకు గానూ ఫిబ్రవరి 2026లో బీహార్ ప్రభుత్వం వైభవ్‌కు రూ. 50 లక్షల నగదు బహుమతిని అందజేసింది.
బ్రాండ్ ప్రకటనలు: ప్రముఖ హెల్త్ డ్రింక్ బ్రాండ్ ‘కాంప్లాన్’ ఫిబ్రవరి 2026లో వైభవ్ సూర్యవంశీని తమ జాతీయ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. ఈ ఒప్పందం ద్వారా కూడా అతడికి భారీ మొత్తంలో పారితోషికం లభించింది.
ఇది కూడా చదవండి: Video: తూచ్.. వాడిదసలు బౌలింగేనా.. స్టాండ్స్‌లో శివాలెత్తిన కావ్యపాప..
వైభవ్ సూర్యవంశీ కేవలం నగదు రూపంలోనే కాకుండా తన అద్భుతమైన ఆటతీరుకు గానూ ఖరీదైన బహుమతులను కూడా అందుకుంటున్నాడు. ‘టాటా కర్వ్ ఈవీ’ కారును సొంతం చేసుకున్నట్లు సమాచారం. అలాగే మైదానంలో అతడు ఉపయోగించే ఒక్కో క్రికెట్ బ్యాట్ విలువ దాదాపు రూ. 1.5 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఇంతటి భారీ సంపాదన, క్రేజ్ ఉన్నప్పటికీ, వైభవ్ ఇప్పటికీ బీహార్‌లోని తన పాత సొంత ఇట్లలోనే ఉంటూ ఎంతో సాదాసీదా జీవితాన్ని గడుపుతున్నాడు.
సచిన్ టెండూల్కర్, పృథ్వీ షా వంటి దిగ్గజాలు సైతం ఇంత చిన్న వయసులో ఊహించని ఆర్థిక బలాన్ని వైభవ్ సూర్యవంశీ కేవలం తన ప్రతిభతో ఐపీఎల్ వేదికగా సాధించాడు. రాబోయే రోజుల్లో భారత సీనియర్ జట్టులో స్థానం సంపాదించుకుంటే, ఈ బీహార్ కుర్రాడి బ్రాండ్ వాల్యూ, ఆస్తుల విలువ స్కై రాకెట్‌లా దూసుకుపోవడం ఖాయం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..