AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బుర్జ్ ఖలీఫాలా మారిన బుడ్డోడి క్రేజ్.. బ్యాట్‌పై స్టిక్కర్ కోసం ఏకంగా బ్లాంక్ చెక్ ఆఫర్..!

Vaibhav Sooryavanshi Bat Sponsorship: చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న వైభవ్ సూర్యవంశీ ప్రయాణం నిజంగా అద్భుతం. ఆటపై అతనికి ఉన్న నిబద్ధత, భయం లేని బ్యాటింగ్ శైలి భవిష్యత్తులో భారత క్రికెట్‌ను మరో ఉన్నత శిఖరానికి తీసుకెళ్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కోట్లాది మంది ఆశలు, బడా కంపెనీల కోట్ల రూపాయల పెట్టుబడుల మధ్య ఈ యువ సంచలనం ఇంకెన్ని రికార్డులను తిరగరాస్తాడో చూడాలి.

బుర్జ్ ఖలీఫాలా మారిన బుడ్డోడి క్రేజ్.. బ్యాట్‌పై స్టిక్కర్ కోసం ఏకంగా బ్లాంక్ చెక్ ఆఫర్..!
Vaibhav Sooryavanshi Bat Sponsorship
Venkata Chari
|

Updated on: May 29, 2026 | 1:17 PM

Share

Vaibhav Sooryavanshi Bat Sponsorship: భారత క్రికెట్‌లో మరో మహా సంచలనం నమోదైంది. కేవలం పదిహేనేళ్ల వయసులోనే ప్రపంచ క్రికెట్ దిగ్గజాల రికార్డులను ముక్కలు చేస్తూ ఒక కుర్రాడు సృష్టిస్తున్న ప్రభంజనం ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్‌లో పరుగుల వరద పారిస్తూ, బ్రాండ్ వాల్యూలో విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్‌లకే సవాల్ విసురుతున్న ఆ యువ కిరటంపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.

ఐపీఎల్‌లో పరుగుల సునామీ.. గేల్ రికార్డు బద్దలు..!

రాజస్థాన్ రాయల్స్ తరపున బరిలోకి దిగిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం ఐపీఎల్ 2026 సీజన్‌లో పరుగుల విధ్వంసం సృష్టిస్తున్నాడు. మైదానంలోకి దిగితే చాలు ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతూ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఏకంగా 680 పరుగులు సాధించి అందరినీ ముక్కున వేలేసుకునేలా చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు బాది క్రికెట్ ప్రపంచాన్ని ఊపిరి సలపకుండా చేశాడు. ఈ క్రమంలోనే ఒకే ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రిస్ గేల్ ఆల్-టైమ్ రికార్డును సైతం ఈ కుర్రాడు బద్దలు కొట్టడం విశేషం.

ఆకాశాన్నంటిన బ్రాండ్ వాల్యూ.. దిగ్గజాలకే సవాల్..

వైభవ్ సూర్యవంశీ కేవలం మైదానంలోనే కాదు, మార్కెట్ ప్రపంచంలోనూ సునామీ సృష్టిస్తున్నాడు. నిన్నటివరకు అంతగా గుర్తింపు లేని ఈ ఆటగాడి బ్రాండ్ వాల్యూ ఇప్పుడు రోజురోజుకూ ఆకాశాన్నంటుతోంది. భవిష్యత్తులో విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజాల రికార్డులను, వారి క్రేజ్‌ను అధిగమించగల ఏకైక ఆటగాడు వీడేనని క్రీడా విశ్లేషకులు గట్టిగా చెప్తున్నారు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ ప్రదర్శనతో మార్కెట్ డిమాండ్‌లో ఎంతోమంది సీనియర్ స్టార్ ఆటగాళ్లను ఈ కుర్రాడు ఎప్పుడో వెనక్కి నెట్టేశాడు.

ఏకంగా ‘బ్లాంక్ చెక్’ ఆఫర్.. రేసులో కార్పొరేట్ దిగ్గజాలు..

ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ వాడుతున్న బ్యాట్ స్పాన్సర్‌షిప్ ఒప్పందం విలువ కేవలం ఏడాదికి 50 లక్షల రూపాయలు మాత్రమే. ఈ ఐపీఎల్ సీజన్‌తో ఆ ఒప్పందం ముగియనుంది. దీంతో భారత్‌లోని ప్రముఖ టైర్ల తయారీ సంస్థలైన ఎంఆర్ఎఫ్, సీయట్ వంటి బడా కంపెనీలు ఈ కుర్రాడితో ఒప్పందం కోసం పోటీ పడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, తదుపరి బ్యాట్ ఒప్పందం కోసం వైభవ్‌కు ఏడాదికి 12 కోట్ల రూపాయలకు పైగా ఆఫర్లు వస్తున్నాయి. విస్మయకరమైన విషయం ఏంటంటే, ఒక ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఈ యువ సంచలనానికి ఏకంగా ‘బ్లాంక్ చెక్’ ఆఫర్ ఇచ్చిందట..! అంటే ఎంత మొత్తమైనా రాసుకోమని, తమ బ్రాండ్‌తో ఒప్పందం చేసుకోవాలని కోరినట్లు తెలుస్తోంది. సాధారణ బ్యాట్ తయారీ సంస్థలు 5 కోట్ల వరకు మాత్రమే ఆఫర్ ఇవ్వగలవు కాబట్టి, ఈ కార్పొరేట్ రేసులో ఆ సంస్థలు వెనుకబడిపోయాయి.

క్వాలిఫైయర్ 2 పోరుకు సిద్ధం..

ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ కేవలం భవిష్యత్తులో భారత క్రికెట్‌ను శాసించే ఆటగాడిగా కనిపించడం లేదు, ప్రస్తుత కాలంలోనే అతడు సామ్రాజ్యాన్ని మొదలుపెట్టేశాడు. క్రికెట్ అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఈ 15 ఏళ్ల వండర్ కిడ్, తన తదుపరి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగే క్వాలిఫైయర్ 2 పోరుకు సిద్ధమవుతున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా రాజస్థాన్ రాయల్స్ తరపున వైభవ్ మరోసారి బ్యాట్‌తో రెచ్చిపోతే, అతని క్రేజ్, మార్కెట్ వాల్యూ ఊహించని స్థాయికి చేరడం ఖాయం.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
బ్యాట్‌పై స్టిక్కర్ కోసం ఏకంగా బ్లాంక్ చెక్ ఆఫర్..!
బ్యాట్‌పై స్టిక్కర్ కోసం ఏకంగా బ్లాంక్ చెక్ ఆఫర్..!
ఏసీ ఎక్కువగా వాడుతున్నారా..? ఈ తప్పులు చేస్తే ప్రమాదం..
ఏసీ ఎక్కువగా వాడుతున్నారా..? ఈ తప్పులు చేస్తే ప్రమాదం..
జ్యేష్ఠ పౌర్ణమి నాడు ఈ ఒక్క పని చేస్తే లక్ష్మీ కటాక్షం.. ఇంట్లో ధ
జ్యేష్ఠ పౌర్ణమి నాడు ఈ ఒక్క పని చేస్తే లక్ష్మీ కటాక్షం.. ఇంట్లో ధ
మిగిలిపోయిన అన్నంతో సూపర్ టేస్టీ ఫ్రైడ్ రైస్.. ఇలా చేసేయండి
మిగిలిపోయిన అన్నంతో సూపర్ టేస్టీ ఫ్రైడ్ రైస్.. ఇలా చేసేయండి
అరణ్యంలో పక్షుల మృత్యుఘోష.. భయాందోళనల్లో జనం!
అరణ్యంలో పక్షుల మృత్యుఘోష.. భయాందోళనల్లో జనం!
వరల్డ్ ఫేమస్ చికెన్ 65.. రెస్టారెంట్ స్టైల్‌లో ఇలా చేసుకోండి..
వరల్డ్ ఫేమస్ చికెన్ 65.. రెస్టారెంట్ స్టైల్‌లో ఇలా చేసుకోండి..
మరో నందమూరి హీరో వచ్చేస్తున్నాడు! కల్యాణ్ రామ్ కుమారుడిని చూశారా?
మరో నందమూరి హీరో వచ్చేస్తున్నాడు! కల్యాణ్ రామ్ కుమారుడిని చూశారా?
కూతురు ఉన్నా లేనట్టే.. చివరి రోజుల్లో ఒంటరిగా..
కూతురు ఉన్నా లేనట్టే.. చివరి రోజుల్లో ఒంటరిగా..
తులా రాశిలో చంద్రుడు.. ఆ రాశుల వారికి ఆరోగ్యం, సంపద ఖాయం..!
తులా రాశిలో చంద్రుడు.. ఆ రాశుల వారికి ఆరోగ్యం, సంపద ఖాయం..!
పాలు కొనేటప్పుడు జాగ్రత్త.. ఇలా టెస్ట్ చేస్తే అసలునిజం బయటపడుద్ది
పాలు కొనేటప్పుడు జాగ్రత్త.. ఇలా టెస్ట్ చేస్తే అసలునిజం బయటపడుద్ది