ప్రమాదంలో వైభవ్ కెరీర్.. బీసీసీఐ అలర్ట్ అవ్వకుంటే వచ్చే ఏడాదే రిటైర్మెంట్..: బాంబ్ పేల్చిన మాజీ ప్లేయర్

Daryll Cullinan on Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ రూపంలో భారతదేశానికి ఒక అద్భుతమైన వజ్రం దొరికిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, డారిల్ కలినన్ చెప్పినట్లుగా ఈ లేత వయసులోనే అతడిపై మోయలేనంత క్రికెట్ భారాన్ని వేయకుండా, సరైన వైద్య సలహాలు, విశ్రాంతి అందిస్తూ కాపాడుకోవాల్సిన బాధ్యత బీసీసీఐపై ఎంతైనా ఉంది. అప్పుడే ఈ నయా సంచలనం భారత క్రికెట్‌కు సుదీర్ఘ కాలం పాటు సేవలందించగలడు.

ప్రమాదంలో వైభవ్ కెరీర్.. బీసీసీఐ అలర్ట్ అవ్వకుంటే వచ్చే ఏడాదే రిటైర్మెంట్..: బాంబ్ పేల్చిన మాజీ ప్లేయర్
Vaibhav Suryavanshi Career

Updated on: Jun 22, 2026 | 7:46 PM

Daryll Cullinan on Vaibhav Sooryavanshi: భారత క్రికెట్ నయా సంచలనం, పరుగుల యంత్రం వైభవ్ సూర్యవంశీ బ్యాట్‌తో సృష్టిస్తున్న సునామీకి ప్రపంచ క్రికెట్ ఫిదా అవుతోంది. అయితే, ఈ 15 ఏళ్ల వండర్ కిడ్ ఆడుతున్న మితిమీరిన క్రికెట్ వెనుక ఒక పెను ప్రమాదం దాగి ఉందంటూ దక్షిణాఫ్రికా మాజీ దిగ్గజం డారిల్ కలినన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా లోకంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

లంక బౌలర్లపై లండన్ దెబ్బ.. 11 బంతుల్లోనే విధ్వంసం..!

ముక్కోణపు సిరీస్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక-ఏ జట్టుపై వైభవ్ సూర్యవంశి ఆడిన ఇన్నింగ్స్ చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది. మైదానంలోకి అడుగుపెట్టిన క్షణం నుంచే లంక బౌలర్లపై విరుచుకుపడుతూ కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కును దాటి రికార్డు సృష్టించాడు. అంతటితో ఆగకుండా కేవలం 29 బంతుల్లోనే 10 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 94 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. అతడి మెరుపు ఇన్నింగ్స్ వల్లే భారత్-ఏ జట్టు 379 పరుగుల భారీ స్కోరు చేసి, ఫైనల్లో 66 పరుగుల తేడంతో ఘనవిజయం సాధించింది. ఐపీఎల్ 2026 సీజన్‌లో 776 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన వైభవ్, ఇప్పుడు ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు సిద్ధమవుతున్నాడు.

ఇది కూడా చదవండి: గంభీర్‌కు తలనొప్పిలా మారిన ముగ్గురు.. ప్రపంచకప్ బెర్త్ కోసం ఇలా కర్ఛీఫ్ వేశారేంటి..?

ఇవి కూడా చదవండి

మణకట్టు, మోచేతులకు ముప్పు.. డారిల్ కలినన్ ఆందోళన..!

వైభవ్ సూర్యవంశీ ప్రతిభను చూసి యావత్ ప్రపంచం మురిసిపోతుంటే, దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు డారిల్ కలినన్ మాత్రం అతడి భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే ఇంత బరువైన బ్యాట్ పట్టుకొని, నిరంతరాయంగా క్రికెట్ ఆడటం వల్ల అతడి చిన్న వయసు కీళ్లు, మణికట్టు, మోచేతులపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించాడు. సచిన్ టెండూల్కర్ కెరీర్ కూడా మోచేతి గాయం (టెన్నిస్ ఎల్బో) కారణంగా కెరీర్ ప్రమాదంలో పడిందని, సచిన్ కూడా వైభవ్ అంత గట్టిగా, ఇన్ని సార్లు బ్యాట్ ఝులిపించలేదని గుర్తుచేశారు.

ఇది కూడా చదవండి: IND vs ENG: ఈ ముగ్గురు ఏం తప్పు చేశారయ్యా.. తోపులా దూసుకెళ్తున్నా, ఛీ కొడుతున్న బీసీసీఐ సెలెక్టర్లు..?

పెరుగుతున్న వయసు.. బీసీసీఐకి మేల్కొలుపు పిలుపు..!

ఈ వయసులో వైభవ్ కండరాలు, కీళ్లు ఇంకా ఎదుగుదల దశలోనే ఉంటాయని, ఈ సమయంలో వాటిపై ఇంత ఒత్తిడి పడితే భవిష్యత్తులో దీర్ఘకాలిక గాయాల బారిన పడే అవకాశం ఉందని కలినన్ స్పష్టం చేశాడు. పూర్వకాలంలో తేలికపాటి బ్యాట్లు వాడుతూ, తక్కువ క్రికెట్ ఆడిన ఆటగాళ్లే మణికట్టు సమస్యలతో ఇబ్బంది పడ్డారని, మరి ఇంత చిన్న వయసులోనే విశ్రాంతి లేకుండా ఆడుతున్న వైభవ్ పరిస్థితి ఏంటని ప్రశ్నించాడు. అతడి సుదీర్ఘ కెరీర్, ఆరోగ్యం కోసం బీసీసీఐ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ విషయంలో కళ్లు తెరవాలని హితవు పలికాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

 

Follow Us