DC vs RCB IPL 2022 Match Prediction: ఢిల్లీతో ఢీ అంటోన్న బెంగళూరు.. గత రికార్డులు ఏం చెబుతున్నాయంటే..

Delhi Capitals vs Royal Challengers Bangalore Preview: ఐపీఎల్‌-15 సీజన్‌లో భాగంగా శనివారం (ఏప్రిల్‌16) రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ (MI vs LSG) మధ్య జరగనుండగా, రెండో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(DC vs RCB) జట్లు తలపడనున్నాయి

DC vs RCB IPL 2022 Match Prediction: ఢిల్లీతో ఢీ అంటోన్న బెంగళూరు.. గత రికార్డులు ఏం చెబుతున్నాయంటే..
Dc Vs Rcb

Updated on: Apr 15, 2022 | 9:22 PM

Delhi Capitals vs Royal Challengers Bangalore Preview: ఐపీఎల్‌-15 సీజన్‌లో భాగంగా శనివారం (ఏప్రిల్‌16) రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ (MI vs LSG) మధ్య జరగనుండగా, రెండో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(DC vs RCB) జట్లు తలపడనున్నాయి. ఢిల్లీ విషయానికొస్తే..గత సీజన్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న ఈ జట్టు ఈ సీజన్లో మాత్రం ఒడిదొడుకులతో ప్రయాణం కొనసాగిస్తోంది. టోర్నీలో ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడిన రిషబ్‌ సేన రెండింట్లో విజయం సాధించగా, మరో రెండింట్లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఇక RCB గురించి గురించి మాట్లాడుకుంటే.. ఆడిన ఐదు మ్యాచ్‌లలో మూడు విజయాలు సాధించింది డుప్లెసిస్‌ సేన. మరో రెండు మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది. ఈక్రమంలో టోర్నీలో మరింత ముందుకు వెళ్లేందుకు ఇరు జట్లు ప్రయత్నిస్తున్నాయి. దీంతో ఈ మ్యాచ్‌ (DC vs RCB) హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్‌ ప్రారంభంకానుంది.

 ఆర్సీబీదే పైచేయి.. అయినా..

కాగా పాయింట్ల పట్టికలో RCB ప్రస్తుతం ఆరో స్థానంలో ఉండగా, ఢిల్లీ జట్టు 7వ స్థానంలో ఉంది. అయితే బెంగళూరు కంటే ఢిల్లీ ఒక మ్యాచ్ తక్కువ ఆడింది. ఢిల్లీలో ఇప్పటి వరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 2 గెలిచి 2 ఓడింది. అదే సమయంలో, RCB 5 మ్యాచ్‌లు ఆడి 3 విజయాలు మరియు 2 ఓటములు చవిచూసింది. ఇక ఐపీఎల్‌ టోర్నీలో ఆర్‌సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటివరకు 27 సార్లు తలపడ్డాయి. RCB 17 మ్యాచ్‌లు గెలుపొందగా, ఢిల్లీ క్యాపిటల్స్ 10 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఇక గత సీజన్ లో రెండు జట్లు రెండుసార్లు ముఖాముఖి తలపడగా, విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో RCB రెండు సార్లు విజయం సాధించింది. అయితే ఈ ఏడాది జరిగిన మెగా వేలం తర్వాత ఇరు జట్లలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. కాబట్టి మ్యాచ్ ఫలితంలోనూ మార్పు జరగవచ్చని నిపుణులు భావిస్తున్నారు. కాగా ఈ మైదానంలో జరిగిన గత ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు సార్లు రెండో సారి బ్యాటింగ్ చేసిన జట్టే గెలుపొందింది. కాబట్టి టాస్ కీలకం కానుంది.

ఎక్కడ చూడొచ్చంటే..
ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్‌లలో వివిధ భాషలలో చూడవచ్చు. అదేవిధంగా డిస్నీ+హాట్‌స్టార్‌లో కూడా లైవ్‌ వీక్షించొచ్చు. ఇక https://tv9telugu.com/ ద్వారా ఎప్పటికప్పుడు మ్యాచ్‌ అప్‌డేట్స్‌ తెలుసుకోవచ్చు.

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు:

రిషబ్ పంత్(కెప్టెన్‌), పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, లలిత్ యాదవ్, రోవ్‌మన్ పావెల్, అక్షర్‌ పటేల్, శార్దూల్ ఠాకూర్, సర్ఫరాజ్ ఖాన్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహమాన్, ఖలీల్ అహ్మద్, మన్‌దీప్ సింగ్, శ్రీకర్ భరత్, టిమ్ సీఫెర్ట్ , లుంగీ ఎన్‌గిడి, అశ్విన్ హెబ్బార్, మిచెల్ మార్ష్, ప్రవీణ్ దూబే, అన్రిచ్ నార్ట్జే, కమలేష్ నాగర్‌కోటి, చేతన్ సకారియా, రిపాల్ పటేల్, యష్ ధుల్, విక్కీ ఓస్త్వాల్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు:

ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్‌), అనుజ్ రావత్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, సుయాష్ ప్రభుదేసాయి, దినేష్ కార్తీక్ , వనిందు హసరంగా, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్, డేవిడ్ విల్లేవుడ్, సిద్దార్థ కౌల్ , షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, కర్ణ్ శర్మ, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, చామ వి మిలింద్, రజత్ పాటిదార్, మహిపాల్ లోమ్రోర్, ఫిన్ అలెన్, అనీశ్వర్ గౌతమ్

Also Read: Mass Copying Viral: ఓర్నీ వీడి క్రియేటివిటీ తగలయ్యా.! ఇదే మాస్ కాపీరా మావా.. చూస్తే ఫ్యూజులు ఔట్..

Vontimitta: పున్నమి వెన్నెలలో రాములోరి కళ్యాణం.. పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్.. టీటీడీ బంగారు కానుకలు

Vontimitta: పున్నమి వెన్నెలలో రాములోరి కళ్యాణం.. పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్.. టీటీడీ బంగారు కానుకలు