Umran Malik: మయాంక్‌ అగర్వాల్‌కు త్రుటిలో తప్పిన ప్రమాదం.. ఉమ్రాన్ మాలిక్‌ బౌలింగ్‌లో ఏ జరిగిందంటే..

ఐపీఎల్ 2022 లీగ్ చివరి మ్యాచ్‌ ముంబైలోని వాంఖడే స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH), పంజాబ్ కింగ్స్(pbks) మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 157 పరుగులు చేసింది...

Umran Malik: మయాంక్‌ అగర్వాల్‌కు త్రుటిలో తప్పిన ప్రమాదం.. ఉమ్రాన్ మాలిక్‌ బౌలింగ్‌లో ఏ జరిగిందంటే..
Mayank

Updated on: May 23, 2022 | 7:38 AM

ఐపీఎల్ 2022 లీగ్ చివరి మ్యాచ్‌ ముంబైలోని వాంఖడే స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH), పంజాబ్ కింగ్స్(pbks) మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 157 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఉమ్రాన్ మాలిక్(umran malik) వేసిన బంతి పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్(mayank agarwal) పక్కటెముకలకు బలంగా తాకింది. ఈ బంతి దాదాపు 143 KPH వేగంతో వచ్చింది. బంతి తగిలిన తర్వాత మైదానంలో మయాంక్ నొప్పితో బాధపడడ్డాడు. అతనికి మైదానంలోనే ఫిజియోతెరపి చేశారు. షారుఖ్ ఖాన్ ఔటైన తర్వాత పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ 7వ ఓవర్లో బ్యాటింగ్‌కు దిగాడు. ఉమ్రాన్ మాలిక్ షార్ట్ బాల్‌తో అతనికి స్వాగతం పలికాడు. మయాంక్ అగర్వాల్ బంతి వేగాన్ని అర్థం చేసుకోకపోవడంతో పక్కటెముకలకు తగిలింది. బ్యాటింగ్‌ కొనసాగించిన అగర్వాల్‌ ఆ తర్వాతి ఓవర్‌లోనే మయాంక్ భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో వాషింగ్టన్ సుందర్ చేతిలో 1 పరుగు వద్ద ఔటయ్యాడు.

ఉమ్రాన్‌ మాలిక్‌కు టీమిండియాలో చోటు దక్కింది. దక్షిణాఫ్రికా(ND Vs SA)తో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కి వీరిని ఎంపిక చేశారు. గత సీజన్‌లో SRH రిటైన్ చేసిన ముగ్గురు ఆటగాళ్లలో మాలిక్ ఒకడు. తన మొదటి సీజన్‌లో అతను 21 వికెట్లు తీసి ఫ్రాంచైజీ విశ్వాసాన్ని చూరగొన్నాడు. అతను తన పేస్‌తో చాలా మంది టాప్-క్లాస్ బ్యాట్స్‌మెన్‌లను ఔట్ చేశాడు. ఇటీవలే 157 కి.మీ వేగంతో IPL చరిత్రలో అత్యంత వేగవంతమైన బంతిని సాధించిన మాలిక్ ఈ IPLలో ఐదో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కూడా ఉన్నాడు. 14 మ్యాచ్‌లలో 20 సగటుతో 22 వికెట్లుతో ఎకానమీ రేటు 8.93గా ఉంది. పంజాబ్ కింగ్స్‌తో ఆకట్టుకునే సీజన్ తర్వాత లెఫ్టార్మ్ సీమర్ అర్ష్‌దీప్ సింగ్ కూడా జాతీయ జట్టులోకి వచ్చాడు. ఈ సిరీస్‌కు KL రాహుల్ కెప్టెన్‌గా పంత్‌ వైస్‌కెప్టెన్‌గా వ్యహరించనున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడావార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి..