IND vs WI: ‘గాయమే కారణం, జట్టు నుంచి తప్పించలేదు’.. వన్డే వరల్డ్‌కప్ టోర్నీ కోసమే..!

India Tour of West Indies: భారత క్రికెట్ జట్టు జూలై 12 నుంచి వెస్టిండీస్‌లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. అలాగే తన పర్యటనలో భాగంగా టీమిండియా 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మేరకు బీసీసీఐ ఇప్పటికే టెస్ట్, వన్డే సరీస్‌ల కోసం భారత్ జట్టును..

IND vs WI: ‘గాయమే కారణం, జట్టు నుంచి తప్పించలేదు’.. వన్డే వరల్డ్‌కప్ టోర్నీ కోసమే..!
Umesh Yadav

Updated on: Jun 26, 2023 | 5:06 PM

India Tour of West Indies: భారత క్రికెట్ జట్టు జూలై 12 నుంచి వెస్టిండీస్‌లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. అలాగే తన పర్యటనలో భాగంగా టీమిండియా 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మేరకు బీసీసీఐ ఇప్పటికే టెస్ట్, వన్డే సరీస్‌ల కోసం భారత్ జట్టును ప్రకటించింది. అయితే టెస్టు సిరీస్ జట్టులో మొహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, చతేశ్వర్ పుజారా వంటి సీనియర్ ప్లేయర్లకు అవకాశం లభించలేదు. ఈ క్రమంలో ఉమేష్ యాదవ్‌ని ఇటీవల జరిగిన ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో రాణించలేదని కావాలనే టీమ్ నుంచి తొలగించరానే వార్తలు వస్తున్నాయి.

అయితే కానీ ఉమేష్‌ని మోకాలి గాయం కారణంగానే పక్కన పెట్టామని, అతను బెంగళూరు ఎన్‌సీఏలో కోలుకుంటున్నాడని, అందుకే వెస్టిండీస్ టూర్‌కి పరిగణనలోకి తీసుకోలేదని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే ఐపీఎల్, ఆ తర్వాత డబ్య్లూటీసీ ఫైనల్‌తో బిజీబిజీగా ఉన్న మొహ్మద్ షిమీని కావాలనే విండీస్ టూర్ నుంచి విశ్రాంతి కల్పించినట్లు తెలుస్తోంది. ఇంకా భారత్ వేదికగా ఈ ఏడాది జరగబోయే వన్డే ప్రపంచ కప్ టోర్నీ సమయానికి అతను అందుబాటులో ఉంచేందుకే భారత సెలెక్టర్లు ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి


విండీస్ పర్యటనకు భారత టెస్ట్ టీమ్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమాన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వీ జైస్వాల్, అజింక్య రహానే(వైస్‌ కెప్టెన్‌), కెఎస్ భరత్(వికెట్‌ కీపర్), ఇషాన్ కిషన్(వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మొహ్మద్‌ సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..