
అప్పుడు.. ఇప్పుడూ టీమిండియాకు ఆ ప్లేయరే విలన్‌గా మారాడు. మ్యాచ్ అందుతోందని అనుకునేలోపే.. తనదైన శైలి దూకుడు బ్యాటింగ్‌తో ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోసి.. కప్పు ఎత్తుకెళ్లాడు. ఇంతకీ అతడెవరో ఈపాటికి మీకు అర్ధమై ఉంటుంది. మరెవరో కాదు.. ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ ట్రావిస్ హెడ్.
ఈ ఏడాది జూన్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య లార్డ్స్ వేదికగా టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ జరిగింది. వరుసగా ఈ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు రెండోసారి భారత్ అర్హత సాధించగా.. ఆస్ట్రేలియా మొదటిసారి ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. ఇక ఆ ఛాంపియన్‌షిప్ అంతటా టీమిండియా విజయాల పరంపర కొనసాగించడంతో.. ఛాంపియన్‌షిప్ ట్రోఫీ ఖాయమే టీమిండియాకు అని ఫ్యాన్స్ అనుకున్నారు. అలాగే టాస్ గెలిచి రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకుని.. ఆరంభంలోనే ఆస్ట్రేలియా 3 వికెట్లకు 76 పరుగులు చేసింది. దీంతో టీమిండియా విజయం కన్ఫర్మ్ అనుకున్నారు. కానీ స్టీవ్ స్మిత్‌తో కలిసి ఒకే ఒక్కడు.. ట్రావిస్ హెడ్ భారత్‌ను అడ్డుకున్నాడు. 163 పరుగుల భారీ స్కోర్ సాధించడంతో పాటు.. స్మిత్‌తో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఫలితంగా టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమిండియా 209 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
ఇక ఇప్పుడు వన్డే వరల్డ్‌కప్ ఫైనల్‌లోనూ భారత్‌కు మరోసారి ట్రోఫీ దక్కకుండా.. అడ్డుపడ్డాడు ట్రావిస్ హెడ్. ఫైనల్ మ్యాచ్‌లో జోరు మీదున్న రోహిత్ శర్మను అద్భుతమైన క్యాచ్‌తో హెడ్ పెవిలియన్ చేర్చగా.. ఆ తర్వాత స్లో-బ్యాటింగ్ పిచ్‌లో భారీ సెంచరీతో కదంతొక్కాడు. 47 పరుగులకే 3 వికెట్లతో పీకల్లోతు కష్టాల్లో పడ్డ ఆస్ట్రేలియాను వన్ మ్యాన్ ఆర్మీలా 120 బంతుల్లో 137 పరుగులు సాధించి.. టీమిండియా నుంచి ట్రోఫీని తన్నుకుపోయాడు. ఈ రెండు ఐసీసీ టోర్నమెంట్లలోనూ టీమిండియా పాలిట విలన్ అయ్యాడు ట్రావిస్ హెడ్.
కాగా, వరల్డ్‌కప్ ముందు వేలు గాయంతో కొన్ని మ్యాచ్‌లకు దూరమైన హెడ్‌ను.. రీప్లేస్ చేయకుండా చివరి వరకు అట్టేపెట్టుకుంది ఆస్ట్రేలియా. ఇక ఆసీస్ సెలెక్టర్లు తనపై ఉంచిన నమ్మకాన్ని వొమ్ము చేయలేదు హెడ్.. తన అద్భుత ఫామ్ కొనసాగించి.. ఫైనల్‌లో ఆస్ట్రేలియాను గెలిపించాడు.
Delivering when it matters the most 🤩
Travis Head dazzles on the grandest stage once again!
More on his #CWC23 Final special 👉 https://t.co/I6lKE0kXAQ pic.twitter.com/cPWusBfVTa
— ICC (@ICC) November 20, 2023
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం..