4,4,4,6తో విధ్వంసం.. 23 బంతుల్లో బీభత్సం సృష్టించిన పంజాబ్ ప్లేయర్.. ఎవరంటే.?

|

Jul 03, 2023 | 5:29 PM

తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో కోవై కింగ్స్ విజయాల పరంపర కొనసాగుతోంది. తాజాగా మధురై పాంథర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోవై కింగ్స్ 44 పరుగుల..

4,4,4,6తో విధ్వంసం.. 23 బంతుల్లో బీభత్సం సృష్టించిన పంజాబ్ ప్లేయర్.. ఎవరంటే.?
Tnpl 2023
Follow us on

తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో కోవై కింగ్స్ విజయాల పరంపర కొనసాగుతోంది. తాజాగా మధురై పాంథర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోవై కింగ్స్ 44 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని సాధించింది. ఈ గెలుపులో అటు బంతి, ఇటు బ్యాట్‌తో కీలక పాత్ర పోషించాడు ఆ జట్టు సారధి షారుఖ్ ఖాన్.

జూలై 2న, ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేఇస్న కోవై కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. కెప్టెన్ షారుఖ్ ఖాన్(53), సచిన్(67), సురేష్ కుమార్(64) మెరుపు అర్ధ శతకాలు చేశారు. ముఖ్యంగా కోవై కింగ్స్ సారధి షారుఖ్ ఖాన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. 20 బంతుల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ పూర్తి చేసిన అతడు.. మొత్తం 23 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 53 పరుగులు చేశాడు.

మొదటి బ్యాట్‌తో ఆకట్టుకున్న షారుఖ్ ఖాన్.. ఆ తర్వాత బంతితో రాణించాడు. 209 పరుగుల భారీ లక్ష్యచేధనలో భాగంగా బరిలోకి దిగిన మధురై పాంథర్స్ జట్టును షారుఖ్ ఖాన్(2/35), సిద్ధార్థ్(3/32), యుదీశ్వరన్(2/16) పదునైన బౌలింగ్‌తో దెబ్బకొట్టారు. ఫలితంగా మధురై 18 ఓవర్లలో 164 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో కోవై కింగ్స్ 44 పరుగుల తేడాతో విజయం సాధించింది.