Most Ducks In Test Cricket: ప్రపంచ టెస్టు క్రికెట్‌లో అత్యధిక సార్లు సున్నా వద్ద అవుట్ అయిన ఆటగాళ్లను పరిశీలిస్తే, టాప్ 5లో ఓ భారత ఆటగాడు కూడా ఉన్నాడు. ఈ విషయంలో వెస్టిండీస్ మాజీ వెటరన్ క్రికెటర్ కోర్ట్నీ వాల్ష్ నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. అదే సమయంలో ఈ జాబితాలో భారత ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ 5వ స్థానంలో ఉన్నాడు. టాప్ 10 ఆటగాళ్ల జాబితాను చూస్తే, ఇందులో మరో భారతీయ ఆటగాడు చేరుతాడు. ఇందులో జహీర్ ఖాన్ 9వ స్థానంలో ఉన్నాడు.
వెస్టిండీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ కోర్ట్నీ వాల్ష్ టెస్టు క్రికెట్‌లో అత్యధిక సార్లు సున్నాకే అవుట్ అయ్యాడు. ఖాతా తెరవకుండానే 43 సార్లు పెవిలియన్ బాట పట్టాడు. 132 టెస్టు మ్యాచ్‌ల్లో 936 పరుగులు చేశాడు. ఈ జాబితాలో ఇంగ్లండ్ ఆటగాడు స్టువర్ట్ బ్రాడ్ రెండో స్థానంలో ఉన్నాడు. ఫాస్ట్ బౌలర్ బ్రాడ్ 150 టెస్టు మ్యాచ్‌ల్లో 38 సార్లు సున్నాకి ఔటయ్యాడు. టెస్టుల్లో 3388 పరుగులు చేశాడు. 526 వికెట్లు తీశాడు. బ్రాడ్ ఒక ఇన్నింగ్స్‌లో 3 సార్లు పది వికెట్లు పడగొట్టాడు.
న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ క్రిస్ మార్టిన్ టెస్టుల్లో అత్యధిక సార్లు సున్నా వద్ద ఔట్ అయ్యి మూడో స్థానంలో ఉన్నాడు. 36 సార్లు ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. 71 టెస్టుల్లో 123 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు గ్లెన్ మెక్‌గ్రాత్ నాలుగో స్థానంలో ఉన్నాడు. అతను 35 సార్లు సున్నా వద్ద ఔట్ అయ్యాడు. అదే సమయంలో, భారత్‌కు చెందిన ఇషాంత్ శర్మ 34 సార్లు సున్నాకి ఔట్ అయ్యి ఐదో స్థానంలో ఉన్నాడు. ఇషాంత్ 105 టెస్టుల్లో 47 పరుగులు చేశాడు.
ఇతర భారత ఆటగాళ్ల గురించి చెప్పాలంటే, కపిల్ దేవ్ 16 సార్లు సున్నాలో ఔట్ అయ్యాడు. మహ్మద్ షమీ కూడా 16 సార్లు ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. ఇవి కాకుండా అనిల్ కుంబ్లే 17 సార్లు, హర్భజన్ సింగ్ 19 సార్లు, బిషన్ సింగ్ బేడీ 20, జహీర్ ఖాన్ 29 సార్లు ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టారు.
Also Read: IND vs SA: ఆఫ్రికన్ గడ్డపై బుమ్రా, శార్దుల్ విధ్వంసం.. గాయాలపాలైన సౌతాఫ్రికా బ్యాటర్లు..!