
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా సోమవారం(ఫిబ్రవరి 24) న్యూజిలాండ్, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ పాకిస్థాన్‌కు ఎంతో కీలకం. ఎందుకంటే.. న్యూజిలాండ్‌పై బంగ్లాదేశ్ గెలిస్తేనే వాళ్లకు సెమీస్ అవకాశం సజీవంగా ఉంటుంది. కానీ, అలా జరగలేదు. న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌పై అలవోకగా విజయం సాధించి సెమీస్‌కు చేరుకుంది. పాక్, బంగ్లా ఇంటికి వెళ్లాయి. అయితే.. పాకిస్థాన్‌కు ఇంత కీలకమైన ఈ మ్యాచ్‌లో ఆ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అదేంటంటే.. న్యూజిలాండ్ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో ఓ వ్యక్తి సడెన్‌గా గ్రౌండ్‌లోకి దూసుకొచ్చాడు. క్రికెటర్ల అభిమానులు వాళ్లని కలిసేందుకు అలా వస్తుండటం కమానే కదా అని అనుకోవచ్చు.
కానీ, ఆ వచ్చిన వ్యక్తి చేతిలో ఓ తీవ్రవాది నాయకుడి ఫొటో పట్టుకొచ్చాడు. పైగా రావడం రావడంతోనే భారత సంతతికి చెందిన న్యూజిలాండ్ యంగ్ బ్యాటర్ రచిన్ రవీంద్ర వైపు దూసుకొచ్చాడు. ఇతనేమైనా సూసైడ్ బాంబరా అనుకొని రచిన్ అప్పటికీ భయపడి దూరంగా జరిగాడు. అయినా కూడా ఆ వ్యక్తి వేగంగా వచ్చి రచిన్‌ను వాటేసుకున్నాడు. ఈ ఘటనతో అంతా ఉలిక్కిపడ్డారు. ఎందుకంటే.. పాకిస్థాన్‌లో భద్రతా సమస్యలు ఉన్నాయనే కారణంగాతోనే చాలా కాలం ఆ దేశానికి ఏ టీమ్ కూడా వెళ్లి క్రికెట్ ఆడలేదు. టీమిండియా అయితే ఇప్పటికీ పాకిస్థాన్ వెళ్లడం లేదు.
గతంలో పాక్‌లో శ్రీలంక క్రికెటర్లపై ఉగ్రదాడి జరిగిన ఘటనల గురించి తెలిస్తే. గత రెండేళ్లుగా మాత్రమే పాక్‌కు వేరే దేశాల జట్లు వచ్చి క్రికెట్ ఆడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీలో ఆతిథ్య పాకిస్థాన్ జట్టు గ్రూప్ స్టేజ్‌లోనే వరుసగా రెండు మ్యాచ్‌లు ఆడి నిష్క్రమించడంతో ఆగ్రహించిన తీవ్రవాదుల మళ్లీ ఏమైనా దాడులకు పాల్పడతారనే భయం పాకిస్థాన్ భద్రతా బలగాలకు కూడా ఉంది. ఈ క్రమంలోనే ఇలా ఓ వ్యక్తి తీవ్రవాది ఫొటోతో గ్రౌండ్‌లోకి రావడం కలకలం రేపింది. అయితే అతన్ని అక్కడున్న సిబ్బంది బయటికి తీసుకెళ్లారు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
Pitch invader attacked Rachin Ravindra. He was holding a poster of radical extremist leader.
Pakistan agency on alert for a terror plot against players and fans pic.twitter.com/57kGjmDaHc
— Riseup Pant (@riseup_pant17) February 25, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.