IND vs SA ODI Series: టీమిండియాకు షాకిచ్చిన సౌతాఫ్రికా.. రంగంలోకి ఓటమెరుగని ప్లేయర్‌..

India vs South Africa: ఇటీవల వన్డే రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న సీనియర్ వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ (Quinton de Kock) రెండు జట్లలోనూ చోటు దక్కించుకున్నాడు. పాకిస్థాన్‌తో జరిగిన సిరీస్‌లో అతను అద్భుతంగా రాణించి 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'గా నిలిచాడు.

IND vs SA ODI Series: టీమిండియాకు షాకిచ్చిన సౌతాఫ్రికా.. రంగంలోకి ఓటమెరుగని ప్లేయర్‌..
Ind Vs Sa Odi

Updated on: Nov 21, 2025 | 8:02 PM

భారత్‌తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌ల కోసం దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు తమ జట్లను శుక్రవారం ప్రకటించింది. ఈ పర్యటనలో భాగంగా మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. రాబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు టెంబా బావుమా (Temba Bavuma) కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, డిసెంబర్ 9 నుంచి ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ఎయిడెన్ మార్క్రమ్ (Aiden Markram) నాయకత్వం వహించనున్నాడు.

రబాడా దూరం..

దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడా (Kagiso Rabada) పక్కటెముకల గాయం కారణంగా ఈ సిరీస్‌లకు దూరమయ్యాడు. టెస్ట్ సిరీస్ సమయంలో తగిలిన గాయం నుంచి కోలుకునేందుకు అతను స్వదేశానికి తిరిగి వెళ్లనున్నాడు.

ఇటీవల వన్డే రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న సీనియర్ వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ (Quinton de Kock) రెండు జట్లలోనూ చోటు దక్కించుకున్నాడు. పాకిస్థాన్‌తో జరిగిన సిరీస్‌లో అతను అద్భుతంగా రాణించి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు.

గత ఏడాది టీ20 ప్రపంచకప్ ఫైనల్ తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ ఆడని పేసర్ అన్రిచ్ నార్జే (Anrich Nortje), టీ20 జట్టులోకి తిరిగి వచ్చాడు. సీనియర్ స్పిన్నర్ కేశవ్ మహారాజ్ కూడా వైట్-బాల్ జట్లలోకి తిరిగి వచ్చాడు.

షెడ్యూల్:

వన్డే సిరీస్: నవంబర్ 30 నుంచి డిసెంబర్ 6 వరకు.

టీ20 సిరీస్: డిసెంబర్ 9 నుంచి ప్రారంభం.

దక్షిణాఫ్రికా వన్డే జట్టు: టెంబా బావుమా (కెప్టెన్), ఒట్నీల్ బాట్మాన్, మాథ్యూ బ్రీట్జ్‌కే, డెవాల్డ్ బ్రెవిస్, నాండ్రే బర్గర్, క్వింటన్ డికాక్, టోనీ డి జోర్జి, రూబిన్ హెర్మన్, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, ఎయిడెన్ మార్క్రమ్, లుంగి ఎంగిడి, ర్యాన్ రికెల్టన్, ప్రేనెలన్ సుబ్రయన్.

దక్షిణాఫ్రికా టీ20 జట్టు: ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), ఒట్నీల్ బాట్మాన్, కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, క్వింటన్ డికాక్, టోనీ డి జోర్జి, డోనోవన్ ఫెర్రేరా, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, జార్జ్ లిండే, కేశవ్ మహారాజ్, క్వెనా మఫాకా, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, అన్రిచ్ నార్జే, ట్రిస్టన్ స్టబ్స్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..