
భారత ప్రధాని నరేంద్ర మోడీ టీమిండియా ఆట తీరును సందర్భం వచ్చినప్పుడల్లా కొనియాడుతున్నారు. గతంలో యూనివర్సిటీ విద్యార్థులనుద్దేశించి ప్రసంగించిన సమయంలో టీమిండియా పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించాడు. తాజాగా మన్ కీ బాత్‌లోనూ టీమిండియా ప్రస్తావన తెచ్చారు. ‘ఈ నెలలో క్రికెట్ నుంచి మనకో శుభవార్త వచ్చింది. ఆదిలో ఎన్నో ఒడుదొడుకులు ఎదురైనా భారత జట్టు అద్భుతంగా పుంజుకుంది. ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ గెలిచింది. మన జట్టు కృషి, సమష్టి పోరాటం స్ఫూర్తిదాయకం’ అని మోదీ అన్నారు. మోదీ వ్యాఖ్యలపై బీసీసీఐ, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించారు. ‘‘ప్రేరణిచ్చే ఈ మాటలకు, ప్రశంసలకు ధన్యవాదాలు. త్రివర్ణ పతాకం అత్యున్నత ఎత్తులో ఎగరడానికి సాధ్యమైనంత వరకు పోరాడతాం’’ అని బీసీసీఐ ట్వీట్ చేసింది. మరోవైపు మోదీ మాటలను కోహ్లీ రీట్వీట్ చేస్తూ జాతీయ జెండాను పోస్ట్ చేశాడు.
Thank you Shri @narendramodi ji for your appreciation and words of encouragement. #TeamIndia will do everything possible to keep the tricolour ?? flying high. @imVkohli @ajinkyarahane88 @RaviShastriOfc @RishabhPant17 @Jaspritbumrah93 @ImRo45 @JayShah @SGanguly99 @ThakurArunS https://t.co/fceD3bgO09
— BCCI (@BCCI) January 31, 2021
— Virat Kohli (@imVkohli) January 31, 2021
తొలి టెస్టులో ఘోర ఓటమి, జట్టుకు ప్రధాన ఆటగాళ్లు దూరమైన ప్రతికూలతల నడుమ.. భారత్ గొప్పగా పోరాడిన సంగతి తెలిసిందే. నాలుగు టెస్టుల సిరీస్‌ను 2-1తో సాధించింది. మెల్‌బోర్న్‌లో బౌలర్ల సమష్టి పోరాటం, రహానె కెప్టెన్ ఇన్నింగ్స్‌తో విజయం సాధించగా, సిడ్నీ టెస్టులో రవిచంద్రన్ అశ్విన్, హనుమ విహారి అద్భుత పోరాట పటిమతో మ్యాచ్ డ్రా ముగించింది. ఇక నిర్ణయాత్మక గబ్బా టెస్టులో యువఆటగాళ్ల సంచలన ప్రదర్శనతో చారిత్రక విజయాన్ని అందుకుంది.