IND vs ZIM: భయపడేదే నిజమైంది.. గాయం కారణంగా దూరమైన స్టార్ ప్లేయర్..

భారత్ వర్సెస్ జింబాబ్వే మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆగస్టు 18 నుంచి ప్రారంభమవుతుంది. దీని కారణంగా ముగ్గురు స్టార్ ప్లేయర్‌లు గాయం తర్వాత తిరిగి రాబోతున్నారు.

IND vs ZIM: భయపడేదే నిజమైంది.. గాయం కారణంగా దూరమైన స్టార్ ప్లేయర్..
India Vs Zimbabwe 2022 Washington Sundar

Updated on: Aug 16, 2022 | 6:10 AM

భయపడుతున్నదే నిజమైంది. భారత క్రికెట్ జట్టు యువ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం తర్వాత చాలా కాలం పాటు పునరాగమనం చేశాడు. మరోసారి గాయం వాషింగ్టన్ సుందర్ కెరీర్‌కు బ్రేక్ వేసింది. కౌంటీ క్రికెట్‌లో గాయం కారణంగా సుందర్ ఆగస్టు 18న ప్రారంభం కానున్న భారత్-జింబాబ్వే సిరీస్‌కు దూరమయ్యాడు. భారత్ వర్సెస్ జింబాబ్వే మధ్య 3 ODI మ్యాచ్‌లు జరగనున్న సంగతి తెలిసిందే. దానితో సుందర్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి రాబోతున్నాడు.

గత వారం ఇంగ్లండ్‌లో జరిగిన రాయల్ లండన్ వన్ డే కప్ సందర్భంగా సుందర్ భుజానికి గాయమైంది. అతను లంకాషైర్ కౌంటీ క్లబ్ తరపున ఆడుతున్నాడు. ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఈ గాయానికి గురయ్యాడు. అప్పటి నుంచి అతను ఈ సిరీస్‌లో ఆడటంపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. ఇప్పుడు ఇదే నిజమని రుజువైంది. వార్తా సంస్థ PTI నివేదిక ప్రకారం 22 ఏళ్ల వాషింగ్టన్ సుందర్ ఈ గాయం నుంచి కోలుకోవడానికి సమయం తీసుకుంటాడు. అటువంటి పరిస్థితిలో అతను మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆడలేడని తెలుస్తోంది.