WTC Final 2023: ప్రాక్టీస్ షురూ చేసిన టీమిండియా ఆటగాళ్లు.. కొత్త కిట్‌తో బరిలోకి..

|

May 26, 2023 | 3:59 PM

Team India: లండన్ చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు తమ కొత్త అడిడాస్ కిట్ ధరించి ప్రాక్టీస్ ప్రారంభించారు. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ జూన్ 7 నుంచి 11 వరకు జరగనుంది.

WTC Final 2023: ప్రాక్టీస్ షురూ చేసిన టీమిండియా ఆటగాళ్లు.. కొత్త కిట్‌తో బరిలోకి..
Ind Vs Aus Wtc Final 2023
Follow us on

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023)లో భారత క్రికెట్ జట్టులోని కొందరు ఆటగాళ్లు బిజీగా ఉండగా.. మరికొందరు ఆటగాళ్లు లండన్ చేరుకున్నారు. IPL 2023 ముగిసిన వెంటనే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ (ICC WTC Final)మొదలుకానుంది. ఇందుకోసం భారత కోచ్ రాహుల్ ద్రవిడ్, శార్దూల్ ఠాకూర్, విరాట్ కోహ్లీ, మహ్మద్ సిరాజ్ సహా ఓ బృందం లండన్ చేరుకుంది. ఐపీఎల్ ముగిసిన వెంటనే మరో బ్యాచ్ భారత్ నుంచి బయలుదేరనుంది. లండన్ చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు కొత్త అడిడాస్ కిట్ ధరించి ప్రాక్టీస్ ప్రారంభించారు.

బీసీసీఐ గతంలో జర్మన్ స్పోర్ట్స్ గూడ్స్ కంపెనీ అడిడాస్‌తో కిట్ స్పాన్సర్‌షిప్ ఒప్పందంపై సంతకం చేసింది. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ జై షా ట్వీట్ ద్వారా తెలియజేశారు. ఇప్పుడు టీమిండియా ఆటగాళ్లు ధరించిన జెర్సీపై అడిడాస్ కంపెనీ లోగో కనిపించింది. ఈ కొత్త లోగో ఉన్న జెర్సీలు ధరించి ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తారు. ఈ ఫొటోను బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.

ఇవి కూడా చదవండి

ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ జూన్ 7 నుంచి 11 వరకు జరగనుంది. లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానం ఈ చారిత్రాత్మక పోరుకు సాక్ష్యం కానుంది. ఈ ముఖ్యమైన టోర్నమెంట్ కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఇప్పటికే టీమ్ ఇండియాను ప్రకటించింది.

అంతకుముందు టెస్టు జట్టు నుంచి తప్పుకున్న అజింక్యా రహానే మళ్లీ పునరాగమనం చేశాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో రహానే తన తుఫాన్ బ్యాటింగ్‌తో సీఎస్‌కే దృష్టిని ఆకర్షించాడు. రోహిత్ శర్మ జట్టుకు నాయకత్వం వహించనుండగా, శుభమన్ గిల్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. కేఎస్ భరత్ వికెట్ కీపర్‌గా వ్యవహరించనున్నాడు.

చెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, మిడిల్ ఆర్డర్ బలంగా ఉన్నారు. నలుగురు ఆల్ రౌండర్లుగా రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్ ఎంపికయ్యారు. పేసర్ల విభాగంలో మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్ లు చోటు దక్కించుకున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..