IND vs ENG: 5 ఏళ్లుగా దంచుడే.. బాల్‌తోనే కాదు, బ్యాట్‌తోనూ విధ్వంసమే.. భారత ఆల్‌రౌండర్ దెబ్బకు రికార్డులు ఖతం..

IND Vs ENG: ప్రస్తుతం ప్రపంచంలోనే నంబర్ వన్ ఆల్ రౌండర్‌గా నిలిచిన రవీంద్ర జడేజా.. బంతితో పాటు బ్యాట్‌తోనూ అద్భుతాలు చేస్తున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి ఇన్నింగ్స్‌లో జడేజా 3 వికెట్లు తీయగలిగాడు. జడేజా బౌలింగ్ అద్భుతంగా ఉండడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 246 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత బ్యాటింగ్‌తో అద్భుతాలు ప్రదర్శించిన జడేజా.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ స్కోరును 436 పరుగులకు చేర్చాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 190 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.

IND vs ENG: 5 ఏళ్లుగా దంచుడే.. బాల్‌తోనే కాదు, బ్యాట్‌తోనూ విధ్వంసమే.. భారత ఆల్‌రౌండర్ దెబ్బకు రికార్డులు ఖతం..
Ravindra Jadeja

Updated on: Jan 27, 2024 | 10:58 AM

IND Vs ENG: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు క్లిష్ట పరిస్థితుల్లో 81 పరుగులతో అజేయంగా ఇన్నింగ్స్ ఆడిన రవీంద్ర జడేజా.. నేడు మూడో రోజు మరో ఆరు పరుగులు జోడించి 87 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. అయితే, ప్రస్తుతం ప్రపంచంలో తన కంటే మెరుగైన ఆల్ రౌండర్ లేడని మరోసారి నిరూపించుకున్నాడు. ఓ దశలో టీమ్ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 50, 60 పరుగులకు మించి ఆధిక్యం సాధించలేదేమో అనిపించింది. కానీ, జడేజా భారత్‌ను క్లిష్ట పరిస్థితి నుంచి గట్టెక్కించడమే కాకుండా 175 పరుగుల ఆధిక్యాన్ని అందించాడు. అయితే రవీంద్ర జడేజా గత 5 ఏళ్లలో టీమ్ ఇండియాకు చాలాసార్లు ఇలాంటి అద్భుతాలు చేశాడనడంలో ఎలాంటి సందేహంల లేదు.

గత ఐదేళ్లలో అతని బ్యాటింగ్‌లో అత్యధిక మెరుగుదల చూపించాడు. రవీంద్ర జడేజా 2012లో భారత్ తరపున టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఆ సమయంలో కూడా జడేజా బ్యాటింగ్ బాగానే ఉంది. అయితే, 2018 వరకు, జడేజా 59 ఇన్నింగ్స్‌లలో 31 సగటుతో 1404 పరుగులు చేశాడు. ఈ సమయంలో, జడేజా 9 అర్ధ సెంచరీలు, ఒక సెంచరీ సాధించాడు. ఆ తర్వాత జడేజా బ్యాటింగ్‌లో అద్భుత మార్పులు చోటు చేసుకున్నాయి. 2018 నుంచి జడేజా 41 ఇన్నింగ్స్‌లలో 45 సగటుతో 1473 పరుగులు చేశాడు. ఈ కాలంలో జడేజా 11 అర్ధ సెంచరీలు, రెండు సెంచరీలు సాధించాడు.

బౌలింగ్‌లోనూ జడేజా అద్భుతాలు..

జడేజా బ్యాట్‌తో పాటు బంతితోనూ అద్భుతాలు చేశాడు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి ఇన్నింగ్స్‌లో జడేజా 3 వికెట్లు తీయగలిగాడు. జడేజా బౌలింగ్ అద్భుతంగా ఉండడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 246 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత బ్యాటింగ్‌తో అద్భుతాలు ప్రదర్శించిన జడేజా.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ స్కోరును 436 పరుగులకు చేర్చాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 190 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న 5 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్ ఇప్పుడు భారత్‌కు అనుకూలంగా మారిందని తెలుస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..