ICC T20 Ranking: తగ్గని సూర్యకుమార్‌ యాదవ్‌ జోరు.. మరోసారి అగ్ర స్థానంలోనే..

|

Nov 16, 2022 | 4:49 PM

ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ , ఐసీసీ టీ20ఐ బ్యాట్స్‌మెన్‌ల తాజా ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. నెంబర్‌ వన్‌ రేసులో సూర్యకుమార్ యాదవ్‌ దారిదాపుల్లో కూడా ఎవరూ లేరు. దీంతో ఈ స్టార్ బ్యాట్స్‌మెన్‌ తన...

ICC T20 Ranking: తగ్గని సూర్యకుమార్‌ యాదవ్‌ జోరు.. మరోసారి అగ్ర స్థానంలోనే..
Surya Kumar Yadav
Follow us on

ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ , ఐసీసీ టీ20ఐ బ్యాట్స్‌మెన్‌ల తాజా ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. నెంబర్‌ వన్‌ రేసులో సూర్యకుమార్ యాదవ్‌ దారిదాపుల్లో కూడా ఎవరూ లేరు. దీంతో ఈ స్టార్ బ్యాట్స్‌మెన్‌ తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. సూర్యకుమార్ T20 ప్రపంచ కప్‌లో సూపర్ 12 దశలో 5 ఇన్నింగ్స్‌ల్లో 3 హాఫ్‌ సెంచరీలతో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి నంబర్ వన్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

దీంతో సూర్యకుమార్‌ తన కెరీర్‌లో అత్యుత్తమ 869 రేటింగ్ పాయింట్‌లను పొందాడు. ఇదిలా ఉంటే టీ20 వరల్డ్‌ కప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో 14 పరుగులకు అవుట్‌ అయిన సూర్య కుమార్‌ 10 పాయింట్లకు పడిపోయాడు. అయినా ర్యాంకింగ్స్‌లో అతని స్థానం చెక్కుచెదరలేదు. ఇక టీ20 వరల్డ్‌ కప్‌లో సూర్యకుమార్ యాదవ్ 189 పరుగులు చేశాడు. 68 స్ట్రైక్ రేట్‌తో 239 పరుగులు చేశాడు. అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు.

ఇంగ్లండ్‌ ఆటగాడు అలెక్స్‌ హేల్స్‌ భారత్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో 47 బంతుల్లో అజేయంగా 86 పరుగులు చేసి 22 స్థానాలు ఎగబాకి 12వ స్థానానికి చేరుకున్నాడు టాప్ 10లో పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ ఒక స్థానం ఎగబాకి మూడో స్థానానికి చేరుకున్నాడు. దక్షిణాఫ్రికాకు చెందిన రిలే రస్సో ఏడో నెంబర్‌కి చేరుకోగా, న్యూజిలాండ్‌కు చెందిన గ్లెన్ ఫిలిప్స్ ఒక స్థానం దిగజారి 8వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. పాకిస్థాన్‌కు చెందిన మహ్మద్ రిజ్వాన్ రెండో స్థానంలో నిలిచాడు. అదే సమయంలో దక్షిణాఫ్రికాకు చెందిన ఐడెన్ మార్క్రామ్ 5వ స్థానంలో కొనసాగుతున్నాడు. డెవాన్ కాన్వే నాలుగో స్థానానికి పడిపోయాడు.

ఇవి కూడా చదవండి

ఇక బౌలర్ల విషయానికొస్తే.. ఇంగ్లండ్‌ బౌలర్‌ ఆదిల్‌ రషీద్‌ ఐదు స్థానాలు ఎగబాకి మూడో స్థానానికి చేరుకున్నాడు. సెమీస్‌లో భారత్‌పై, ఫైనల్‌లో పాకిస్థాన్‌పై అద్భుత ప్రదర్శన చేశాడు రషీద్‌. ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన సామ్ కరణ్ కూడా 2 స్థానాలు ఎగబాకి ఐదో స్థానానికి చేరుకున్నాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..