Team India : సౌతాఫ్రికా టీ20 సిరీస్‌కు టీమిండియా స్క్వాడ్ ఇదే.. పాండ్యా, గిల్ వచ్చేశారు కానీ.. రింకూకు మళ్లీ నిరాశేనా ?

సౌతాఫ్రికాతో జరగబోయే 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ ప్రకటన రాయ్‌పూర్‌లో భారత్-సౌతాఫ్రికా రెండో వన్డే మ్యాచ్ జరుగుతుండగానే వచ్చింది. ఈ జట్టులో ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే.. గాయాల నుంచి కోలుకున్న స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, ఓపెనర్ శుభ్‌మన్ గిల్ మళ్లీ జట్టులోకి వచ్చారు.

Team India : సౌతాఫ్రికా టీ20 సిరీస్‌కు టీమిండియా స్క్వాడ్ ఇదే.. పాండ్యా, గిల్ వచ్చేశారు కానీ.. రింకూకు మళ్లీ నిరాశేనా ?
Team India T20 Squad

Updated on: Dec 03, 2025 | 6:27 PM

Team India : సౌతాఫ్రికాతో జరగబోయే 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ ప్రకటన రాయ్‌పూర్‌లో భారత్-సౌతాఫ్రికా రెండో వన్డే మ్యాచ్ జరుగుతుండగానే వచ్చింది. ఈ జట్టులో ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే.. గాయాల నుంచి కోలుకున్న స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, ఓపెనర్ శుభ్‌మన్ గిల్ మళ్లీ జట్టులోకి వచ్చారు. అయితే ఫామ్‌లో ఉన్న యువ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ రింకూ సింగ్‌ను జట్టు నుంచి పక్కన పెట్టడం అభిమానులకు కాస్త నిరాశ కలిగించే అంశం.

గాయాల నుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన కీలక ఆటగాళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.. శుభ్‌మన్ గిల్ మెడ గాయం కారణంగా టెస్ట్, వన్డే సిరీస్‌లకు దూరమయ్యాడు. రికవరీలో ఉన్నప్పటికీ, సెలెక్టర్లు అతన్ని టీ20 స్క్వాడ్‌లో వైస్ కెప్టెన్‌గా సెలక్ట్ చేశారు. అయితే, గిల్ సిరీస్‌లో ఆడటం అనేది పూర్తిగా అతని ప్రస్తుత ఫిట్‌నెస్ నివేదికపై ఆధారపడి ఉంటుందని సెలెక్టర్లు స్పష్టం చేశారు. ఇక హార్దిక్ పాండ్యా రెండు నెలల తర్వాత జట్టులోకి వచ్చాడు. ఆసియా కప్ తర్వాత గాయపడిన హార్దిక్, ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడి తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకున్నాడు.

మరోవైపు రింకూ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డిలను జట్టు నుంచి తొలగించారు. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన టీ20 స్క్వాడ్‌నే అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ దాదాపు కొనసాగించింది. అయితే, హార్దిక్ పాండ్యా కోసం స్థలం ఇవ్వడానికి రింకూ సింగ్‌ను పక్కన పెట్టారు. రింకూకు గత ఏడాది ఆసియా కప్, ఆస్ట్రేలియా సిరీస్‌లలో సరైన అవకాశాలు లభించలేదు. ఈ సంవత్సరం మొత్తం కేవలం 5 టీ20 మ్యాచ్‌లలో ఆడిన రింకూను, జట్టు నుంచి పక్కన పెట్టడం జరిగింది. రింకూతో పాటు, నితీశ్ కుమార్ రెడ్డి కూడా ఈ పర్యటన నుంచి బయటపడ్డాడు.

దక్షిణాఫ్రికా సిరీస్ కోసం బీసీసీఐ ప్రకటించిన 15 మంది సభ్యుల భారత జట్టు వివరాలు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్-కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, కుల్‌దీప్ యాదవ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్.