IND vs WI: వెస్టిండీస్‌తో తొలి టెస్టు.. బరిలోకి దిగే భారత జట్టు ఇదే.. మారిన గిల్ ప్లేస్.. ఎందుకంటే?

|

Jun 27, 2023 | 9:57 AM

IND vs WI India Probable Test Playing XI: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌లో ఓటమి తర్వాత, వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ద్వారా 2023-25 ​​టెస్ట్ ఛాంపియన్‌షిప్ వేటను భారత జట్టు మొదలుపెట్టనుంది. ఈ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ను పరిశీలిస్తే, రెండు మ్యాచ్‌లు భారత్‌కు ఎంతో కీలకమైనవి.

IND vs WI: వెస్టిండీస్‌తో తొలి టెస్టు.. బరిలోకి దిగే భారత జట్టు ఇదే.. మారిన గిల్ ప్లేస్.. ఎందుకంటే?
Ind Vs Wi
Follow us on

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌లో ఓటమి తర్వాత, వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ద్వారా 2023-25 ​​టెస్ట్ ఛాంపియన్‌షిప్ వేటను భారత జట్టు మొదలుపెట్టనుంది. ఈ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ను పరిశీలిస్తే, రెండు మ్యాచ్‌లు భారత్‌కు ఎంతో కీలకమైనవి. రోహిత్ శర్మ కెప్టెన్సీలో, భారత క్రికెట్ జట్టు ఈ మ్యాచ్‌లను చాలా సీరియస్‌గా తీసుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తప్పకుండా గెలవడానికి ప్రయత్నిస్తుంది. భవిష్యత్తు జట్టును సిద్ధం చేయడం ప్రారంభించనుంది.

వెస్టిండీస్‌తో జరిగే భారత జట్టును ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కరేబియన్ గడ్డపై గెలవాలంటే, టీమ్ ఇండియా పూర్తి స్థాయిలో ఢీ కొట్టాలి. ఈసారి, అంతర్జాతీయ అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉన్న యశస్వి జైస్వాల్‌.. అరంగేట్రంలో అదరగొట్టాల్సి ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో యశస్వి జస్వాల్ రోహిత్ శర్మతో కలిసి భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించగలడు. ఇప్పుడు యశస్వి ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తే, ఈ పరిస్థితిలో శుభ్‌మన్ గిల్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు రావచ్చు.

విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో ఉండగా, జట్టు వైస్ కెప్టెన్ అజింక్యా రహానే ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు రావొచ్చు. భారత్ తరపున రవీంద్ర జడేజా ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయగలడు. కేఎస్ భరత్ ఏడో స్థానంలో ఉన్నాడు. వెస్టిండీస్‌పై వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్‌గా ప్లేయింగ్ ఎలెవన్‌లో కేఎస్ భరత్‌కు చోటు కల్పించవచ్చు. అదే సమయంలో, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌ ఆడని అశ్విన్ కూడా ప్లేయింగ్ 11లో చోటు దక్కించుకునే ఛాన్స్ ఉంది.

ఇవి కూడా చదవండి

ఈ పర్యటనలో మహ్మద్ షమీ గైర్హాజరీలో, మహ్మద్ సిరాజ్ భారత ఫాస్ట్ బౌలింగ్‌కు సారథ్యం వహించనున్నాడు. అదే సమయంలో లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్‌కు కూడా ప్లేయింగ్ ఎలెవన్‌లో అవకాశం ఇవ్వవచ్చు. వీరిద్దరూ కాకుండా ముఖేష్ శర్మను ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చవచ్చు. ముఖేష్‌కు అవకాశం లభిస్తే భారత్‌ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..