
IND vs NZ ODI 1st ODI Playing 11: భారత్ పర్యటనకు రానున్న న్యూజిలాండ్ జట్టు, మూడు వన్డేల సిరీస్‌లో పాల్గొననుంది. మొదటి వన్డే జనవరి 11న జరగనుండగా, ఆ తర్వాత 14, 18 తేదీల్లో మిగిలిన రెండు మ్యాచ్‌లు జరుగుతాయి. వడోదర, రాజ్‌కోట్, ఇండోర్ నగరాలు ఈ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. కాగా, మొదటి వన్డే కోసం భారత ప్లేయింగ్ 11కు సంబంధించి కీలక సమాచారం వెలువడింది. ఓపెనర్ల స్థానాల కోసం శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్‌లను ఎంపిక చేశారు. అయితే, మొదటి వన్డేలో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. ఇందులో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు.
ఒక కండిషన్: మొదటి వన్డే ఆడుతున్న రోహిత్ శర్మకు బీసీసీఐ ఒక కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. రోహిత్ కేవలం పరుగులు సాధించడమే కాకుండా, ఫీల్డింగ్‌లో తన ఫిట్‌నెస్‌ను కూడా నిరూపించుకోవాలని బోర్డు సూచించినట్లు సమాచారం. ఒకవేళ మొదటి మ్యాచ్‌లో ఫీల్డింగ్‌లో తడబడి, పరుగులు కూడా చేయకపోతే.. తర్వాతి రెండు వన్డేలకు రోహిత్‌కు విశ్రాంతి ఇచ్చి, అతని స్థానంలో యశస్వి జైస్వాల్‌ను ఆడించే అవకాశం ఉంది.
2027 వన్డే ప్రపంచకప్ సమయానికి రోహిత్ శర్మకు 39 ఏళ్లు వస్తాయి. అప్పుడు అతని ఫిట్‌నెస్‌పై సమస్యలు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న బీసీసీఐ, ఇప్పటి నుంచే యశస్వి జైస్వాల్‌ను జట్టులోకి సిద్ధం చేస్తోంది. ఒకవేళ న్యూజిలాండ్ సిరీస్‌లో జైస్వాల్‌కు అవకాశం దక్కి, అతను రాణిస్తే.. అతనికి వరుసగా అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.
శ్రేయస్ అయ్యర్ ఫిట్‌నెస్‌పై కొన్ని సందేహాలు ఉన్నాయి. మరికొన్ని రోజుల్లో బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో అతను ఫిట్‌నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ శ్రేయస్ ఫిట్‌గా ఉంటే, గతంలో రుతురాజ్ ఆడిన 4వ స్థానంలో అతను బ్యాటింగ్‌కు వస్తాడు. ఒకవేళ శ్రేయస్ ఫిట్‌నెస్ నిరూపించుకోలేకపోతే, అతనికి ప్రత్యామ్నాయంగా రిషబ్ పంత్ మొదటి వన్డేలో బరిలోకి దిగే అవకాశం ఉంది. మిగతా జట్టులో పెద్దగా మార్పులు ఏమీ ఉండవు. రెగ్యులర్ ప్లేయర్లే ప్లేయింగ్ 11లో ఉంటారు.
భారత ప్రొబబుల్ 11 (న్యూజిలాండ్‌తో తొలి వన్డే): శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ / రిషబ్ పంత్, కె.ఎల్. రాహుల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.
2027 వన్డే ప్రపంచకప్‌నకు ఇంకా ఏడాది కంటే ఎక్కువ సమయం ఉన్నందున, 15 మంది సభ్యుల జాబితాలో ఉన్న ఆటగాళ్లందరికీ ఈ సిరీస్‌లో రొటేషన్ పద్ధతిలో అవకాశం లభిస్తుందని సమాచారం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..