WTC Final 2023: డ్యూక్ బాల్‌తోనే డబ్ల్యూటీసీ ఫైనల్.. మాస్టర్ ప్లాన్‌తో బరిలోకి రోహిత్ సేన.. ఏం చేస్తున్నారంటే?

IND vs AUS: ఐపీఎల్ ముగిసిన తర్వాత మరో క్రికెట్ పండుగ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో మొదలుకానుంది. టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్లు జూన్ 7 నుంచి తలపడనున్నాయి.

WTC Final 2023: డ్యూక్ బాల్‌తోనే డబ్ల్యూటీసీ ఫైనల్.. మాస్టర్ ప్లాన్‌తో బరిలోకి రోహిత్ సేన.. ఏం చేస్తున్నారంటే?
Rubber Ball Wtac 2023 Ind vs aus

Updated on: Jun 04, 2023 | 10:36 AM

ఐపీఎల్ ముగిసిన తర్వాత మరో క్రికెట్ పండుగ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో మొదలుకానుంది. టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్లు జూన్ 7 నుంచి తలపడనున్నాయి. ఇప్పటికే లండన్‌లో ఉన్న రోహిత్ సేన పదే అరండేల్ క్యాజిల్ క్రికెట్ క్లబ్‌లో రంగు రంగుల రబ్బరు బంతులతో ప్రాక్టీస్ చేస్తున్నారు. కొత్త వాతావరణానికి అనుగుణంగా తమను మార్చుకుంటున్నారు.

ముఖ్యంగా క్యాచ్ ప్రాక్టీస్ కోసం టీమిండియా ఆటగాళ్లు మాస్టర్ ప్లాన్ వేశారు. భారత ఆటగాళ్లందరూ వివిధ రంగుల బంతుల్లో క్యాచ్‌లు పట్టడం ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. దీనికి కారణం ఉంది. దాదాపు రెండు నెలల పాటు భారత ఆటగాళ్లు ఐపీఎల్ టోర్నీలో ఆడారు. ఇక్కడ తెల్లటి బంతిని ఉపయోగిస్తారు. ఎర్ర బంతి వాడేందుకు అలవాటు పడే క్రమంలో ఇదొక వ్యూహంగా చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

దీనిపై ఫీల్డింగ్ కోచ్ మాట్లాడుతూ.. రబ్బర్ బంతుల్ని మన ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా సిద్ధం చేశామన్నారు. గల్లీ క్రికెట్‌లో వీటిని ఉపయోగిస్తుంటారు. ఫీల్డింగ్ ప్రాక్టీస్‌కు సిద్ధమయ్యాం. ఇంగ్లండ్, న్యూజిలాండ్ దేశాల్లో ఈ బంతులను ఎక్కువగా వాడుతుంటారని చెప్పుకొచ్చాడు.

ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ జూన్ 7న లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్‌లో ప్రారంభమవుతుంది. 2021లో జరిగిన టెస్ట్ ఛాంపియన్‌షిప్ తొలి ఎడిషన్ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో భారత జట్టు తలపడ్డాయి. అయితే, ఆ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. రెండోసారి ఫైనల్ చేరిన టీమ్ ఇండియా.. టైటిల్ గెలవాలని కలలు కంటోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..