KL Rahul – Athiya Shetty Wedding: టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టి త్వరలో పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమయ్యారు. ఈమేరకు అతియా శెట్టి తండ్రి సునీల్ శెట్టి, మ్యారెజ్ ప్లాన్స్ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది పెళ్లి చేయనున్నట్లు, అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఓ వీడియోలో తెలిపాడు. మీడియా నివేదికల ప్రకారం, అతియా, కేఎల్ రాహుల్ కుటుంబాలు ఇంతకు ముందు అనుకున్న ప్రణాళికలలో కొన్ని మార్పులు చేశారంట. నవంబర్ లేదా డిసెంబర్‌లో కాకుండా, వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో వివాహం చేసేందుకు సిద్ధమయ్యారంట. రాహుల్, అతియాల వివాహం దక్షిణ భారత సంప్రదాయాల ప్రకారం జరుగుతుందని అంటున్నారు.
పెళ్లి తర్వాత కొత్త ఇంటికి..
వివాహం తర్వాత కేఎల్ రాహుల్, అతియా కొత్త ఇంటికి మారనున్నారంట. నివేదికల ప్రకారం, ఈ జంట ముంబైలోని పాలి హిల్‌లోని సంధు ప్యాలెస్‌లోని విలాసవంతమైన ఇంటికి మారనున్నట్లు తెలుస్తుంది.
సౌత్ ఇండియా స్టైల్లోనే పెళ్లి..
ఈ జోడీ దక్షిణ భారత సంప్రదాయంలో పెళ్లి చేసుకుంటారంట. సునీల్ శెట్టి మంగళూరులోని ముల్కిలోని ఓ కుటుంబంలో జన్మించాడు. ఆయన దక్షిణ భారతీయుడు. అలాగే రాహుల్ కూడా మంగళూరు కుటుంబానికి చెందినవాడు కావడంతో, ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మూడేళ్లుగా డేటింగ్..
కేఎల్ రాహుల్, అతియా మూడేళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. చాలా కాలంగా ఇద్దరూ తమ రిలేషన్‌షిప్‌ను సీక్రెట్‌గా ఉంచారు.
2015లో తన కెరీర్ ప్రారంభించిన అథియా..
సూరజ్ పంచోలీ సరసన ‘హీరో’ చిత్రంతో అతియా 2015లో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. దీనితో పాటు ఆమె మరో రెండు చిత్రాలు ‘ముబారకన్’, ‘మోతీచూర్ చక్నాచూర్’లో నటిస్తోంది. ఇందులో నవాజుద్దీన్ సిద్ధిఖీ కూడా ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు.
ఆసియా కప్‌లో రాహుల్ బీజీ..
ఈ కర్ణాటక బ్యాటర్ గాయం తర్వాత భారత జట్టులోకి పునరాగమనం చేశాడు. శనివారం నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్‌లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. భారత్ తన తొలి మ్యాచ్‌ను ఆగస్టు 28న పాకిస్థాన్‌తో ఆడనుంది.