Video: డిన్నర్ పార్టీకి స్పెషల్ కార్‌లో ఎంట్రీ ఇచ్చిన గంభీర్ శిష్యుడు.. రాజసం మాములుగా లేదుగా..

Gautam Gambhir Dinner Party Video: హర్షిత్ రాణా తరచూ భారత జట్టులోకి ఎంపిక కావడంపై క్రికెట్ వర్గాల్లో విమర్శలు, చర్చలు జరుగుతున్న నేపథ్యంలో, టెస్ట్ జట్టులో లేకపోయినా ప్రత్యేక ఆహ్వానం మేరకు అతను గంభీర్ డిన్నర్‌కు హాజరవడం అతని గంభీర్‌తో ఉన్న సాన్నిహిత్యాన్ని మరోసారి స్పష్టం చేసింది. తనపై వస్తున్న విమర్శలను లెక్క చేయకుండా, హర్షిత్ రాణా తన గురువు ఇచ్చిన విందుకు ప్రత్యేకంగా హాజరవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Video: డిన్నర్ పార్టీకి స్పెషల్ కార్‌లో ఎంట్రీ ఇచ్చిన గంభీర్ శిష్యుడు.. రాజసం మాములుగా లేదుగా..
Harshit Rana Video

Updated on: Oct 09, 2025 | 7:53 AM

Harshit Rana a Special Car at Coach Gautam Gambhir’s Team Dinner Video: భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇటీవల న్యూ ఢిల్లీలోని తన నివాసంలో టీమ్ ఇండియా టెస్ట్ జట్టు సభ్యులందరికీ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. వెస్టిండీస్‌తో జరగబోయే చివరి టెస్ట్ మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరే ముందు జట్టు సభ్యుల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని పెంచడానికి ఈ డిన్నర్‌ను ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి టెస్ట్ జట్టులోని ఆటగాళ్లు, సహాయక సిబ్బంది హాజరయ్యారు.

హర్షిత్ రాణా స్పెషల్ ఎంట్రీ..

టీమిండియా ఆటగాళ్లు, సహాయక సిబ్బంది దాదాపుగా అంతా ఒకే టీమ్ బస్సులో గంభీర్ నివాసానికి చేరుకున్నారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్ వంటి ఆటగాళ్లంతా సాధారణ దుస్తుల్లో బస్సు దిగి నడుచుకుంటూ ఇంట్లోకి వెళ్లారు.

ఇవి కూడా చదవండి

అయితే, ఈ విందుకు భారత యువ పేసర్ హర్షిత్ రాణా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. టెస్ట్ జట్టులో భాగం కానప్పటికీ, హర్షిత్ రాణా విందుకు హాజరు కావడమే కాకుండా, జట్టు సభ్యులందరూ బస్సులో రాగా, అతను మాత్రం ప్రత్యేక ప్రైవేట్ కారులో విందుకు హాజరయ్యాడు. హర్షిత్ రాణా తన కారులో స్టైల్‌గా ఎంట్రీ ఇవ్వడం అక్కడి దృశ్యాలను ఫొటోలు, వీడియోలు తీస్తున్న మీడియా దృష్టిని ఆకర్షించింది. ఈ ప్రత్యేక ప్రవేశానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఎందుకీ ప్రత్యేకత..?

హర్షిత్ రాణా ప్రస్తుతం వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో జట్టు సభ్యుడు కానప్పటికీ, అతను త్వరలో ఆస్ట్రేలియాలో జరగబోయే ODI, T20I సిరీస్‌ల కోసం భారత జట్టులో ఎంపికయ్యాడు. ముఖ్యంగా, హర్షిత్ రాణాకు భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మెంటర్‌షిప్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తరపున ఆడిన అనుభవం ఉంది. గంభీర్ కోచింగ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత హర్షిత్ రాణాకు నిరంతరం మద్దతు లభిస్తోంది.

హర్షిత్ రాణా తరచూ భారత జట్టులోకి ఎంపిక కావడంపై క్రికెట్ వర్గాల్లో విమర్శలు, చర్చలు జరుగుతున్న నేపథ్యంలో, టెస్ట్ జట్టులో లేకపోయినా ప్రత్యేక ఆహ్వానం మేరకు అతను గంభీర్ డిన్నర్‌కు హాజరవడం అతని గంభీర్‌తో ఉన్న సాన్నిహిత్యాన్ని మరోసారి స్పష్టం చేసింది. తనపై వస్తున్న విమర్శలను లెక్క చేయకుండా, హర్షిత్ రాణా తన గురువు ఇచ్చిన విందుకు ప్రత్యేకంగా హాజరవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ డిన్నర్ భారత జట్టుకు రాబోయే కీలకమైన ఆస్ట్రేలియా పర్యటనకు ముందు ఉల్లాసకరమైన వాతావరణాన్ని అందించింది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..